AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gayathri Gupta: ‘నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి’.. నటి గాయత్రి గుప్తా..

ఫిదా సినిమాతో పాపులారిటి సొంతం చేసుకున్న గాయత్రి మాస్ మాహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. ఇవే కాకుండా తెలుగులో బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ వంటి చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న గాయత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సీని ప్రయాణం గురించి, వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

Gayathri Gupta: 'నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి'.. నటి గాయత్రి గుప్తా..
Gayathri Gupta
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2023 | 7:09 AM

Share

డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో కీలకపాత్రలో నటించింది గాయత్రి గుప్తా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించింది ఈ తెలుగమ్మాయి. షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన గాయత్రి సినిమాల్లో హీరోయిన్ గా నటించలేకపోయింది. ఫిదా సినిమాతో పాపులారిటి సొంతం చేసుకున్న గాయత్రి మాస్ మాహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. ఇవే కాకుండా తెలుగులో బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ వంటి చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న గాయత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సీని ప్రయాణం గురించి, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అలాగే ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ క్రిటికల్ ఉందని.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చింది.

తన ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నాని.. అలాగే తన తండ్రిని ఎప్పుడు ఫాదర్ గా భావించలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక గాయత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తన అనారోగ్య సమస్య ఏంటన్నది పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇక గతంలో తన ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది.

ఇక గాయత్రి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ చేస్తుంది. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, విష్ణు ప్రియా ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ దయలో నటించింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యాపిల్ నుంచి కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్
యాపిల్ నుంచి కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్స్
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఇదే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఇదే..
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!