Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త హీరోయిన్లు వస్తున్నా ఆమె దూసుకుపోతున్నారు. Toxic, NBK111, మూకుతి అమ్మన్ 2, రెక్కయి వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నయన్, ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. సీనియర్ నాయికలు నెమ్మదించినా, నయనతార మాత్రం తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.
ఇండస్ట్రీకి ఎంతమంది కుర్ర భామలు క్యూ కడుతున్నా.. లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులోనే ఉంది. తోటి హీరోయిన్స్ అంతా రేసులో వెనుకబడుతున్నా సరే.. నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు సరికదా.. ఇంకా పెరుగుతుంది. చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న ఈ బ్యూటీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? ఇండస్ట్రీలోకి ఎంతమంది కొత్త కుర్ర హీరోయిన్లు వస్తున్నా.. నయనతార స్పీడ్‌ను, ఆమెకున్న స్టార్‌డమ్‌ను కనీసం మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఆమెతో పాటే కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ చూసిన సమంత, తమన్నా, కాజల్, అనుష్క లాంటి సీనియర్లు నెమ్మదించినా.. నయనతార మాత్రం అస్సలు తగ్గేదే లే అంటూ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. మన శంకరవరప్రసాద్ గారులో నటించి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న లేడీ సూపర్ స్టార్.. జూన్ 4న పాన్ ఇండియా మూవీ టాక్సిక్‌తో రాబోతున్నారు. దీనికి తోడు బాలకృష్ణ కొత్త సినిమా NBK111లోనూ హీరోయిన్‌గా ఈ భామనే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం లాంటి సినిమాలు చేసారు బాలయ్య, నయనతార. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు మూకుతి అమ్మన్ 2, రెక్కయి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు నయనతార. వరుస ప్రాజెక్టులు ఉండటంతో.. డిమాండ్‌కు తగ్గట్లే ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలో నయన్‌ను బీట్ చేసే హీరోయిన్ ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ
కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా
Indian 3: ఇండియన్ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??
Dhurandhar 2: తెలుగు ధురంధర్2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

