Sitara Ghattamaneni: బార్బీ డాల్‏లా మహేష్ గారాలపట్టి.. సితార ధరించిన ఫ్రాక్ ధరెంతో తెలుసా ?..

ఇప్పటికే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెట్టింట ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ నిత్యం ఫ్యామిలీ ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సితార ఇన్ స్టా ఖాతాకు ఇప్పటివరకు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‏లో జరిగిన ఓ ఈవెంట్లో తన తల్లి నమ్రతతో కలిసి హజరయ్యింది సితార. బేబీ పింక్ కలర్ గౌనులో అచ్చం బార్బీ డాల్‏లా కనిపించింది. సీతూపాపకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

Sitara Ghattamaneni: బార్బీ డాల్‏లా మహేష్ గారాలపట్టి.. సితార ధరించిన ఫ్రాక్ ధరెంతో తెలుసా ?..
Sitara Ghattamaneni
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2023 | 4:00 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెట్టింట ఫుల్ యాక్టివ్‏గా ఉంటూ నిత్యం ఫ్యామిలీ ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సితార ఇన్ స్టా ఖాతాకు ఇప్పటివరకు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‏లో జరిగిన ఓ ఈవెంట్లో తన తల్లి నమ్రతతో కలిసి హజరయ్యింది సితార. బేబీ పింక్ కలర్ గౌనులో అచ్చం బార్బీ డాల్‏లా కనిపించింది. సీతూపాపకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా సీతూపాప ధరించిన బేబీ పింక్ గౌను ధర గురించి తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఆ గౌను ధర రూ.12.5 వేలు. ఆ గౌనులో అద్భుతంగా కనిపించడమే కాకుండా.. తన చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

చిన్న వయసులోనే ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది సితార. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. మరోవైపు ఇన్ స్టాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. అంతేకాకుండా సీతూపాప యువ ఫ్యాషన్ స్టార్ గా ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవలే సితార ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు అంబాసిడర్‏కు వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ షూట్ కు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఎంబీ ఫౌండేషన్‏కు విరాళంగా ఇచ్చేసింది. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలకు సైకిల్స్ కానుకగా అందించింది. దీంతో సితార మంచి మనసుపై ప్రశంసలు కురిపించింది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.చాలా కాలం తర్వాత ఇందులో మహేష్ మాస్ క్యారెక్టర్ చేయనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.