Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఉచిత షోస్.. కానీ వారికి మాత్రమే ఫ్రీ ఎంట్రీ..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జవాన్ చిత్రాలు ఒకేరోజు విడుదలైన పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ఇప్పటివరకు షారుఖ్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడిప్పుడే అనుష్క చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి్ మూవీ టీం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ఇక ఉచిత షోస్ వేయనున్నారు.

Miss Shetty Mr Polishetty: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఉచిత షోస్.. కానీ వారికి మాత్రమే ఫ్రీ ఎంట్రీ..
Miss Shetty Mr Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2023 | 4:22 PM

బాహుబలి తర్వాత హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. తొలిసారి అనుష్క, నవీన జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే సినిమా బాగున్నప్పటికీ మరోవైపు జవాన్ సినిమా గట్టిపోటీనిచ్చింది. దీంతో కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జవాన్ చిత్రాలు ఒకేరోజు విడుదలైన పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ ఇప్పటివరకు షారుఖ్ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడిప్పుడే అనుష్క చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి్ మూవీ టీం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమాను ఇక ఉచిత షోస్ వేయనున్నారు. కానీ ఈ ఫ్రీ షో ఎంట్రీ అందరికీ ఉండదు..కేవలం మహిళలకు మాత్రమే అని చిత్రయూనిట్ ప్రకటించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఫ్రీ షో ఉండనుంది. సెప్టెంబర్ 14న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాను ఉచిత షో ఉంటుందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ స్పెషల్ మార్నింగ్ షోను ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలు ఉచితంగా వీక్షించవచ్చని తెలిపింది. “క్యాలెండర్లలో మార్క్ చేసుకోండి. రెండు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో మహిళల కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుంది. లిస్ట్ చెక్ చేసుకోండి” అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ అనుష్క సైతం తన ఇన్ స్టా ఖాతాలో స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. విడుదలైన ఐదు రోజుల్లో దాదాపు రూ.13.48 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి నుంచి అంతంతమాత్రంగా వసూళ్లు వచ్చినప్పటికీ ఈ వీకెండ్‍లో మాత్రం కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌