AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రేపే ప్రారంభం.. రూట్, టైమింగ్స్ ఇవే..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఏపీ, తెలంగాణకు రైల్వేశాఖ మరో అమృత్ భారత్ రైలు ప్రకటించింది. ఇది తమిళనాడు నుంచి కేరళ మీదుగా ఏపీ, తెలంగాణకు సర్వీసులు అందించనుంది. ఈ నెల 11వ తేదీన దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది.

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రేపే ప్రారంభం.. రూట్, టైమింగ్స్ ఇవే..
Amrit Bharat Express
Venkatrao Lella
|

Updated on: Mar 10, 2026 | 6:30 PM

Share

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు తీపికబురు. ఈ మేరకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సర్వీసులు అందిస్తుండగా.. మరో రైలు సామాన్య ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు రైలు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 11వ తేదీన ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ రైళ్ల టైమ్ షెడ్యూల్స్, ఏయే స్టేషన్లలో ఆగుతుంది? అనే వివరాలను కూడా ప్రకటించింది. వాటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

ఈ ప్రాంతాల మధ్య సర్వీసులు

నాగర్ కోయిల్-చర్లపల్లి-నాగర్ కోయల్ మధ్య కొత్త అమృత్ భారత్ రైలు ప్రారంభించేందుకు రైల్వే బోర్డు అనుమతులు మంజూరు చేసినట్లు మార్చి 10వ తేదీన దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులోని నాగర్ కోయిల్, హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ఈ రైలు సర్వీసులు అందించనుంది. బుధవారం ఈ రైలు ప్రారంభం కానుంది. నాగర్ కోయిల్-చర్లపల్లి(06357) రైలు బుధవారం 17.30 గంటలు నాగర్ కోయిల్ నుంచి బయల్దేరుతుంది. వల్లియూర్ స్టేషన్‌కు 18.20, తిరుణెవల్లికి రూ.19.35, కొవిల్ పట్టికి 20.33, సాతూర్‌కు 20.53కు, విరుదునగర్‌కు 21.53 గంటలకు, మధురైకు 22.40కు, దుండిగల్‌కు 23.43కు, తిరుచాచిపల్లి 01.40, తంజావూర్ 02.43, పాపనాశనంకు 03.05 గంటలకు, కుంభకోణంకు 03.18కు, చిదంబరంకు 5 గంటలు, విల్లుపురం జంక్షన్‌కు 06.55 గంటలకు, చెన్నై ఎగ్మోర్‌కు 09.55కు, సుళ్లూరుపేటకు 11.48కు, నెల్లూరుకు 13.18కు, ఒంగోలుకు 14.48కు, చీరాలకు 15.20కు, బాపట్లకు 15.35కు, తెనాలికి 16.48 గంటలకు చేరుకుంటుంది.

నాలుగు రాష్ట్రాలకు కనెక్టివిటీ

ఇక గుంటూరుకు 17.40 గంటలకు, సత్తెనపల్లికి 18.59 గంటలకు, మిర్యాలగూడకు 20.59 గంటలకు, నల్లగొండకు 21.29 గంటలకు చేరుకోనుంది. ఇక చర్లపల్లికి 23.45 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను కవర్ చేస్తోంది. దీంతో నాలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది.  ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. సదూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇది సేవలు అందించనుంది. తక్కువ ధరతో  వీటిల్లో ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి  రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రయాణం చేస్తున్నాయి. ఇది మూడో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా చెప్పవచ్చు. అటు త్వరలో చర్లపల్లి-కామాఖ్య మధ్య మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది.  ఇప్పటికే రైల్వేశాఖ నుంచి ప్రకటన రాగా.. త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?
ఏడాది పాటు కరెంట్ లేకపోతే ఈ ప్రపంచం ఏమౌతుందో తెలుసా?