AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బాణసంచా పేలుళ్లలో సర్వస్వం కోల్పోయిన యువతి.. అల్లు అర్జున్ ఏం చేశాడో తెలుసా? జీవితాంతం..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన ఓ మానసిక దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఒకసారి ఆర్థిక సాయంతో సరిపెట్టకుండా జీవితాంతం యువతికి భరోసా ఉండేలా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాడు.

Allu Arjun: బాణసంచా పేలుళ్లలో సర్వస్వం కోల్పోయిన యువతి.. అల్లు అర్జున్ ఏం చేశాడో తెలుసా? జీవితాంతం..
Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 10, 2026 | 5:46 PM

Share

ఇటీవల ఆంద్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పేలుడు ప్రమాదంలో కడింపల్లి దుర్గ దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందే ఆమె తల్లి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో దుర్గ ఒంటరిగా మిగిలిపోయింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మృతి చెందడంతో దుర్గకు అన్నం పెట్టే వారు కూడా లేరని చాలా మంది చలించిపోతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న దుర్గ దీన గాథ అభిమానులు, సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కు చేరింది.ఈ క్రమంలో అనాథలా మిగిలిపోయిన మానసిక దివ్యాంగురాలి పరిస్థితిని చూసి చలించిపోయాడు బన్నీ. ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దుర్గ సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. నెలకు రూ.7,500 చొప్పున జీవితాంతం దుర్గ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు.

అల్లు అర్జున్ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేట్లపాలెం గ్రామానికి వెళ్లి దుర్గను స్వయంగా కలిశారు. ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ బాలికకు ఈ ఆర్థిక సాయం ఎంతో భరసా నిస్తుందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయికి జీవితాం ఆర్థిక భరోసా నిచ్చిన అల్లు అర్జున్ రియల్ హీరోనంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

దుర్గతో మాట్లాడుతోన్న అల్లు అర్జున్ అభిమానులు.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us