AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు మా బాగోగులు చూసేది ఆయన మాత్రమే.. వారు నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న

నందమూరి తార‌క‌ర‌త్న‌ 2023 ఫిబ్రవరిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత భార్య అలేఖ్య రెడ్డి పెద్దగా బయటకు రావడం లేదు. పిల్లలతోనే ఎక్కువగా సమయం గడుపుతోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన భర్తను గుర్తుకు తెచ్చుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతోంది.

ఇప్పుడు మా బాగోగులు చూసేది ఆయన మాత్రమే.. వారు నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
Alekhya Tarakratna
Basha Shek
|

Updated on: Mar 10, 2026 | 6:46 PM

Share

నందమూరి తారకరత్న ఈ లోకం నుంచి వెళ్లిపోయి మూడేళ్లు గడిచిపోయాయి. 2023 ఫిబ్రవరిలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా పూర్తిగా కుంగిపోయింది. ఈ విషాదం నుంచి బయటపడడానికి చాలా రోజులే పట్టింది. నిత్యం తారకరత్నను గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే తన పిల్లల పెంపకంతోనే బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తారకరత్న మరణం తర్వాత అలేఖ్య బయట కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. ఎలాంటి ఫంక్షన్లు, కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదామె. ఈ క్రమంలో తారకరత్న మరణం తర్వాత మొదటి సారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది అలేఖ్య. తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది. అలాగే భర్త మరణం తర్వాత తాను, తన పిల్లలు పడుతున్న ఇబ్బందులను తల్చుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

‘ నేను తారక్‌ను తొలుత హైదరాబాద్ లోనే కలిసాను. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన అందర్నీ మన అని కలుపుకొనేవారు. అప్పటికే నేను విడాకులు తీసుకున్నాను. అసలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ తారక్ నన్ను కన్విన్స్ చేసాడు. నాన్నకు ఆయన ముందే తెలుసు. దీంతో తననే వచ్చి మా అమ్మానాన్నలతో మాట్లాడమన్నాను. ముందు ఒప్పుకోకపోయినా ఒక నెలరోజులకు మా పేరెంట్స్ ఒకే అన్నారు. అయితే తారక్ వాళ్ల సైడ్ ఒప్పుకోలేదు. నేను మా మామయ్య , అత్తమ్మ అని యాక్సెప్ట్ చేశాను. కానీ వాళ్లు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పెద్ద వాళ్లు కదా అలాగే ఉంటుంది. నా మీద కోపం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తారకరత్న మరణం తర్వాత మొదటి ఇంటర్వ్యూ..

‘ నేను చాలా సార్లు వాళ్లకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. నేను వారి విషయంలో చాలా పాజిటివ్ గానే ఉన్నాను. కానీ నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితోనూ కాంటాక్ట్ లో లేను. ఒకప్పుడు కళ్యాణ్ అన్న మంచి ఫ్రెండ్ లా ఉండే వాడు. ఒక్క బాల బాబాయ్ మాత్రం ఉన్నారు మా కోసం. ఆయనకు మా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. నాకున్నదాంట్లో నేను పిల్లలని బాగా పెంచగలను కానీ తారక్ అమ్మానాన్నలు కూడా పిల్లలను దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో అదొక్కటే కోరిక’ అని చెప్తూ ఎమోషనల్ అయింది అలేఖ్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులు తారక రత్న భార్యకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

తారకరత్న పిల్లలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?