AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా!

భారతీయ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కాఫీ 140కి పైగా దేశాలకు ఎగుమతి అయింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), లిబియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఈజిప్ట్, కువైట్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి విస్తరిస్తున్న మార్కెట్లతో పాటు జిబూటి, మైక్రోనేషియా, తైమూర్-లెస్టే వంటి కొత్త దేశాలకు కూడా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.

ప్రతి గింజలో రైతు కష్టం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం దానికి ఫిదా!
Indian Coffee
Balaraju Goud
|

Updated on: Aug 07, 2026 | 11:50 AM

Share

భారతీయ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కాఫీ 140కి పైగా దేశాలకు ఎగుమతి అయింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), లిబియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఈజిప్ట్, కువైట్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి విస్తరిస్తున్న మార్కెట్లతో పాటు జిబూటి, మైక్రోనేషియా, తైమూర్-లెస్టే వంటి కొత్త దేశాలకు కూడా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. జీఐ (Geographical Indication) ట్యాగ్ పొందిన భారతీయ కాఫీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో పాటు, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం సహా జీఐ నమోదిత కాఫీ సాగు ప్రాంతాల రైతులకు కాఫీ బోర్డు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతు అందిస్తోందని తెలిపారు.

కేరళకు చెందిన ‘వయనాడ్ రోబస్టా కాఫీ’ భౌగోళిక సూచిక (GI) హోదా పొందిన ఉత్పత్తిగా నమోదు అయిందని మంత్రి జితిన్ ప్రసాద పేర్కొన్నారు. జీఐ-ట్యాగ్ కాఫీలకు అధీకృత వినియోగదారుల రిజిస్ట్రార్‌గా కాఫీ బోర్డు వ్యవహరిస్తోందని, రైతులు, వ్యాపారులు, ప్రాసెసర్లు సహా కాఫీ విలువ గొలుసులోని భాగస్వాములకు జీఐ నమోదు, వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జీఐ కాఫీలకు మార్కెట్ విస్తరణ కల్పించేందుకు కాఫీ రుచి చూసే కార్యక్రమాలు, కొనుగోలుదారులు–విక్రేతల సమావేశాలు, కాఫీ ఆధారిత వాణిజ్య ప్రదర్శనలు, ఆహార – పానీయాల ఎక్స్‌పోలలో కాఫీ బోర్డు చురుకుగా పాల్గొంటోందని చెప్పారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కాఫీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ICDP) కింద చిన్న, గిరిజన కాఫీ రైతులకు ఆర్థిక, సాంకేతిక అభివృద్ధి మద్దతు అందిస్తున్నట్లు వెల్లడించారు. 2024–25తో పోలిస్తే 2025–26లో జీఐ నమోదు పొందిన అరేబికా కాఫీ సగటు ఎగుమతి యూనిట్ విలువ 34.36 శాతం, రోబస్టా కాఫీ 29.73 శాతం పెరగడం భారతీయ కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

భారత జీఐ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇండియా జీఐ ఫెయిర్, జీఐ మహోత్సవ్, జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో ప్రత్యేక జీఐ పెవిలియన్లను ఏర్పాటు చేస్తోంది. అదనంగా, ‘కాఫీస్ ఆఫ్ ఇండియా’ బ్రాండ్ పేరుతో విలువ ఆధారిత కాఫీ ఉత్పత్తులను దేశీయ, విదేశీ మార్కెట్లలో ప్రోత్సహిస్తోంది. రిటైల్ ప్యాక్‌లపై ‘Made in India’ గుర్తింపుతో భారతీయ కాఫీకి ప్రత్యేక బ్రాండింగ్ కల్పిస్తోంది.

భారతీయ జీఐ కాఫీలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడానికి విదేశాల్లోని భారత మిషన్ల సహకారంతో గౌర్మెట్ జీఐ కాఫీ గిఫ్ట్ బాక్సులను కూడా కాఫీ బోర్డు అభివృద్ధి చేసింది. 2018–19 నుంచి ఇప్పటివరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన 41 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొని భారతీయ కాఫీని విస్తృతంగా ప్రచారం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
IND vs WI 1st T20I: శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
IND vs WI 1st T20I: శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..