AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7G Brindavan Colony: రీరిలీజ్ కాబోతున్న ‘7G బృందావన్ కాలనీ’.. ఎప్పుడంటే..

డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించగా.. సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇలయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా..

7G Brindavan Colony: రీరిలీజ్ కాబోతున్న '7G బృందావన్ కాలనీ'.. ఎప్పుడంటే..
7g Brindavan Colony Movie
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2023 | 7:03 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా ‘7G బృందావన్ కాలనీ’. 2004లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పా్న్స్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించగా.. సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇలయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా.. ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

ఇక చాలా రోజులుగా ‘7G బృందావన్ కాలనీ’ సినిమా రీరిలీజ్ చేయాలని సినీ ప్రియులు ఎదురుచూస్తుండగా.. తాజాగా రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 22న ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తామని ఓ ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ‘7G బృందావన్ కాలనీ’ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతుండడంతో యూత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ రూపొందిస్తామని అటు డైరెక్టర్ సెల్వరాఘవన్ చెప్పడంతో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఇందులో మొదటి పార్ట్ లో మాదిరిగానే రవి కృష్ణ హీరోగా నటించనుండగా.. హీరోయిన్ ఎవరనేది ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా సీక్వెల్ పై మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
పొటాషియం అధికంగా ఉంటే 5 రకాల ఆహారాలు ఇవే!
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
ఆ హీరోను కానీ చూడగానే దండం పెట్టాలనిపిస్తుది.. తనికెళ్ల భరణి..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
తెలుగు మన వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే..
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
ఇంటిగోడలపై మెలిచే ఈ మొక్కలను ఇలా సింపుల్‌గా తొలగించండి!
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
అదృష్ట రాశులు ఇవే.. వీరి జీవితాల్లో గొప్ప మలుపు
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి: మీ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదంటే
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
2 ఫోర్లు, 5 సిక్స్‌లతో లేడీ సెహ్వాగ్ దూకుడు.. 24 బంతుల్లోనే హాఫ్
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు
వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
వాషింగ్ మెషిన్ కొనేస్తే సరిపోదు.. ఈ ఖర్చులు ఉంటాయని మీకు తెలుసా?
మహిళల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
మహిళల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..