Health ATM: ఎనీ టైం క్లినిక్ ఆవిష్కరణ.. ఈ మెషిన్ ద్వారా జ్వరం నుంచి క్యాన్సర్ వరకూ అన్ని రకాల టెస్టులు

హైదరాబాద్ కు చెందిన జెమ్ ఓపెన్ క్కుబ్ టెక్నాలజీస్ సంస్థ ఎనీ టైం క్లినిక్ ని తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎనీ టైం క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ప్రణామ్ హాస్పిటల్స్ కలిసి ఈ మెషిన్ ను పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చారు. తొలిసారిగా ఈ మెషిన్ చందానగర్ లోని ప్రణామ్ హాస్పిటల్ లో ప్రారంభించారు. బేసిక్‌ హెల్త్‌ చెకప్‌, కంటి పరీక్షలు వంటి సుమారు డెబ్భై ఐదు రకాల పరీక్షలను ఈ మెషిన్ ద్వారా చేసుకోవచ్చు.

Health ATM: ఎనీ టైం క్లినిక్ ఆవిష్కరణ.. ఈ మెషిన్ ద్వారా జ్వరం నుంచి క్యాన్సర్ వరకూ అన్ని రకాల టెస్టులు
Health Atm
Follow us

| Edited By: Surya Kala

Updated on: Oct 07, 2023 | 10:22 AM

బ్యాంక్ ఏటీఎమ్స్ చూశాం.. వాటర్ ఏటీఎమ్స్ చూశాం..  తాజాగా గోల్డ్ ఏటీఎమ్స్.. టీ అండ్ కాఫీ ఏటీఎమ్స్ కూడా చూశాం కానీ మెడికల్ ఏటీఎం ఎప్పుడైనా చూశారా.? ఏంటి మెడికల్ ఏటీఎం అనుకుంటున్నారా.? అవును మీరు విన్నది నిజమే ఎనీ టైం క్లినిక్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్ కి వెళ్లాలంటే ఓ పెద్ద టాస్క్..  డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే వరకు అయితే కాస్త స్పీడ్ గానే పనయిపోతుంది..  ఆ తరువాతే డాక్టర్ ఏదైనా టెస్ట్స్ రాస్తేనే ఇంకా వెయిట్ చేయక తప్పదు. డయాగ్నస్టిక్స్ దగ్గర గంటల తరబడి క్యూ లో నిల్చుని..  తీరా టెస్ట్ అయిపోయిందనుకుంటే టెస్ట్ రిపోర్ట్ కోసం రేపు రండి… సాయంత్రం వరకు వెయిట్ చేయండి అంటారు. ఇందంతా ప్రాసెస్ అవ్వడానికి ఎంత తక్కువ అనుకున్న కనీసం 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి డాక్టర్ ని కలవాలి. కానీ ఇప్పుడీ పని లేకుండా..  టైం వేస్ట్ అవ్వకుండా..  క్షణాల్లోనే మన ఆరోగ్య సమస్యను తెలుసుకుని  డాక్టర్ ని సంప్రదించి.  చిటికెలో టెస్ట్స్ చేపించుకుని రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు.

హైదరాబాద్ కు చెందిన జెమ్ ఓపెన్ క్కుబ్ టెక్నాలజీస్ సంస్థ ఎనీ టైం క్లినిక్ ని తయారు చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎనీ టైం క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ప్రణామ్ హాస్పిటల్స్ కలిసి ఈ మెషిన్ ను పబ్లిక్ కు అందుబాటులోకి తెచ్చారు. తొలిసారిగా ఈ మెషిన్ చందానగర్ లోని ప్రణామ్ హాస్పిటల్ లో ప్రారంభించారు. బేసిక్‌ హెల్త్‌ చెకప్‌, కంటి పరీక్షలు, ఈఎన్‌టీ, చర్మం, నెయిల్‌ ఇమేజ్‌ కాప్చరింగ్‌, హెచ్‌ఐవీ, లంగ్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ట్యూమర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, హార్ట్‌ డిసీజ్‌, కొవిడ్‌, ఆల్కహాల్, ఐక్యూ టెస్టులను దీని ద్వారా చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ల తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ర్యాపిడ్ టెస్ట్స్ కూడా చేసుకోవచ్చు.

మొబైల్‌ నెంబర్‌, థంబ్‌ స్కానర్‌, హెల్త్‌కార్డు, ఆధార్‌ కార్డు ద్వారా తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మెషిన్ ఇచ్చే వచ్చే సూచనల ఆధారంగా టెస్ట్స్ చేసుకోవాలి. టెస్ట్ రిపోర్ట్స్ తో పాటు వెంటనే వైద్యులతో వీడియో కాలింగ్‌, అక్కడికక్కడే ప్రిస్కిప్షన్‌ ప్రింటవుట్‌ తీసుకోవచ్చు. ఒకే ఒక్క అటెండర్‌ సహాయంతో యంత్రం ఇచ్చే సూచనల ఆధారంగా రోగులే తమ పరీక్షలు చేసుకోవచ్చు. మెషిన్ కు సెట్ చేసిన వెబ్ కెమెరా ద్వారా వీడియోకాల్‌లో ఉన్న వైద్యులు సమస్యను గుర్తించి ప్రిస్కిప్షన్‌ను అందిస్తారు. పరీక్షల రిపోర్టులు నేరుగా మొబైల్‌కు రావడంతోపాటు అక్కడే ప్రింట్‌ తీసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్‌ హెల్త్‌ రికార్డును పరిశీలించొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ మెషిన్ ద్వారా డెబ్భై ఐదు రకాల పరీక్షలు చేసేలా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి మెషిన్ ను మెడికల్ డయాగ్నస్టిక్స్ రూమ్ గా తయారు చేశారు. త్వరలోనే ఈ మెషిన్ ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్ లో అందుబాటులో ఉంచనున్నారు. సిటీలో అయితే మూల మూలన హాస్పిటల్ ఉంటుంది ఎమర్జెన్సీలో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఈ సౌకర్యం ఉండదు. అందుకోసమే వీటిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు.

దీని ద్వారా చేసుకునే టెస్ట్ లకు సాధారణంగా హాస్పిటల్ లో చేసుకునే టెస్టుల్లో తీసుకునే ఫీజులో ముప్పై శాతం మాత్రమే ఫీజ్ తీసుకోనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ మెషిన్ కు ఇతర దేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.