Fizzy Drinks and Cancer : మహిళలు బీ కేర్ ఫుల్.. అతిగా స్వీట్ డ్రింక్స్ తాగుతున్నారా.. మీ కాలేయం ప్రమాదంలో పడినట్లే..
స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల మహిళలు లివర్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఇప్పుడు ఓ పరిశోధనలో తేలింది. రోజూ స్వీట్ డ్రింక్స్ తీసుకునే మహిళల్లో లివర్ క్యాన్సర్ ముప్పు 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, మరణం బారిన పడే ప్రమాదం కూడా దాదాపు 70 శాతానికి పెరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చాలా సందర్భాలలో క్యాన్సర్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. మరణానికి దారితీస్తుంది. అయితే క్యాన్సర్ వ్యాధి బారిన పడడానికి పెద్ద కారణం రిలాక్స్‌డ్ లైఫ్‌స్టైల్, చెడిపోయిన ఆహారం. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. స్వీట్ డ్రింక్స్ తాగడం వల్ల మహిళలు లివర్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఇప్పుడు ఓ పరిశోధనలో తేలింది. రోజూ స్వీట్ డ్రింక్స్ తీసుకునే మహిళల్లో లివర్ క్యాన్సర్ ముప్పు 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, మరణం బారిన పడే ప్రమాదం కూడా దాదాపు 70 శాతానికి పెరుగుతుంది.
గత 20 ఏళ్లుగా మహిళలపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురించబడింది. వచ్చే 20 ఏళ్లలో కాలేయ క్యాన్సర్ కారణంగా మరణాలు 50 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని కూడా తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొన్నారు..
కాలేయ క్యాన్సర్ ప్రమాదకరం
ఈ పరిశోధన ప్రధాన రచయిత లాంగ్ గ్యాంగ్ జావో… షుగర్ , కాలేయ క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని చెప్పారు. ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలను ప్రతిరోజూ తీసుకుంటే అది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయ క్యాన్సర్‌తో పాటు, కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కూడా కారణమవుతుంది. అయితే ఈ పరిశోధన మరింత విస్తృతంగా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తదుపరి పరిశోధనలో కూడా ఇలాంటి ఫలితాలు వస్తే చికిత్స పై మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాలేయ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి
కాలేయంలో అనారోగ్యకరమైన క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు గుర్తించడం అంత ఈజీ కాదు. చాలా సందర్భాల్లో ఏదైనా సమస్య వచ్చినా పెద్దగా పట్టించుకోరు. నిరంతర పొత్తికడుపు నొప్పి, వాంతులు, నిరంతర అలసట, బరువు తగ్గడం ఈ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు. కాలేయ క్యాన్సర్ రావడానికి చెడు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
లివర్ సిర్రోసిస్ వ్యాధి, చాలా కాలంగా ఫ్యాటీ లివర్ సమస్య కూడా లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేవారు.. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
లివర్ సేఫ్ గా ఉండాలంటే..
- తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి
- మద్యం సేవించవద్దు
- ఉప్పు, చక్కెర, శుద్ధి చేసిన పిండిని మితంగా ఉపయోగించండి
- రోజువారీ వ్యాయామం చేయండి
- హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోండి
- మీకు కడుపు నొప్పి లేదా ఏవైనా ఇతర లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..