AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer: రాత్రి 9 తర్వాత ఆహారం తింటున్నారా.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరిక..

రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ కుమార్ చెబుతున్నారు. దీనివల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. క్రమంగా ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పేగుల్లో క్యాన్సర్ వస్తుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక రాత్రి 9 గంటలకు ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.

Cancer: రాత్రి 9 తర్వాత ఆహారం తింటున్నారా.. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ హెచ్చరిక..
Health Tips
Surya Kala
|

Updated on: Aug 04, 2023 | 10:23 AM

Share

క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. నేటికీ ఈ వ్యాధికి మందు లేదా వ్యాక్సిన్ లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. అయితే తినే ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్ వ్యాధి కారకమని అని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రి పూట భోజనం చేసే అలవాటు వారు ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని మీకు తెలుసా. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ నివేదిక ప్రకారం రాత్రి భోజనం, నిద్ర మధ్య దాదాపు రెండు గంటల గ్యాప్ ఉండాలి. ఇలాంటి గ్యాప్ లేకుండా తినడం, నిద్ర పోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మానవ శరీరం జీవ గడియారం సమతుల్యత క్షీణించడం వల్ల ఇది జరుగుతుంది. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ.

జర్నల్ ఆఫ్ క్యాన్సర్ నివేదిక కూడా రాత్రిపూట ఆలస్యంగా తినడం ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతుందని పేర్కొంది. రాత్రి భోజనం 9 గంటలకు ముందే తినాలని ఈ నివేదికలో పేర్కొన్నారు. దీని తర్వాత తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 రెట్లు పెరుగుతుంది. రాత్రిపూట మద్యం సేవించే లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినే వ్యక్తుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. కేన్సర్‌తో పాటు అనేక వ్యాధులకు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పొట్టకు సంబంధించిన వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

అర్థరాత్రి తినడం వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే?

రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ కుమార్ చెబుతున్నారు. దీనివల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. క్రమంగా ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పేగుల్లో క్యాన్సర్ వస్తుంది. అంతే కాకుండా రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక రాత్రి 9 గంటలకు ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.

ఇవి కూడా చదవండి

జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది

ప్రస్తుతం జంక్ ఫుడ్ తినే అలవాటు ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్న భోజనంలో ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పిల్లలు, యువత, పెద్దలు అనే తేడా లేదు.. ఎక్కువగా జంక్ ఫుడ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ ఫుడ్ క్యాన్సర్ కారకం అని హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం ఫాస్ట్ ఫుడ్‌లో హైడ్రోజన్ కొవ్వు , కృత్రిమ స్వీటెనర్ వాడతారు. అవి శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కణాలను పెంచుతాయి. దీని వల్ల కడుపు పేగుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు అమెరికా లాంటి దేశాల్లో ఈ క్యాన్సర్ కేసులు నమోదయ్యేవి.. అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా పేగు క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఫాస్ట్ ఫుడ్ అని తెలుస్తోంది.

ఫాస్ట్ ఫుడ్ లో రసాయనాలు

ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని ధర్మశిల ఆస్పత్రికి చెందిన క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ వివరించారు. ఫాస్ట్ ఫుడ్ సులభంగా జీర్ణం కాదు. అనేక రకాల ప్యాక్ చేసిన ఆహారాన్ని తాజాగా ఉంచేందుకు రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనం ఆహారం తీసుకునే సమయంలో శరీరంలోకి ప్రవేశించి ప్రేగుల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీని వల్ల చాలా కాలంగా కడుపులో ఉన్న సమస్య పెరిగి క్రమంగా క్యాన్సర్‌కు కారణమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..