Cancer: క్యానర్ బారిన పడుతున్న చిన్నారులు.. ఎయిమ్స్‌లో చికిత్స.. ఇప్పుడు క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తున్న బాధితులు

క్యాన్సర్ ఐదు ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఇది జెనెటిక్ వ్యాధి.. ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో స్నితి పుట్టిన నాలుగో నెలలో క్యాన్సర్ సోకింది. ప్రస్తుతం స్నితికి 12 ఏళ్లు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న స్నితి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. ఆ బాలిక ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

Cancer: క్యానర్ బారిన పడుతున్న చిన్నారులు.. ఎయిమ్స్‌లో చికిత్స.. ఇప్పుడు క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తున్న బాధితులు
Cancer
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2023 | 9:10 AM

మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవన విధానం కూడా మారింది. దీంతో వయసు తో సంబంధం లేకుండా అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్. ఈ వ్యాధిలో అనేక రకరకాలున్నాయి. అయితే ఢిల్లీ కి చెందిన 12 ఏళ్ల స్నితి పుట్టిన కొద్ది నెలలకే క్యాన్సర్ బారిన పడింది. అది కళ్లకు కు సంబంధించిన క్యాన్సర్ బారిన పడింది. ఈ వ్యాధిని  వైద్య భాషలో రెటినోబ్లాస్టోమా అంటారు. ఈ క్యాన్సర్ ఐదు ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఇది జెనెటిక్ వ్యాధి.. ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో స్నితి పుట్టిన నాలుగో నెలలో క్యాన్సర్ సోకింది. ప్రస్తుతం స్నితికి 12 ఏళ్లు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న స్నితి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది. ఆ బాలిక ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న స్నితి అనేక విషయాలను Tv9తో పంచుకుంది.

స్నితిలాగే ఎయిమ్స్‌లో క్యాన్సర్‌ను ఓడించిన 250 మంది పిల్లలు ఒక కార్యక్రమంలో తమ జీవితాలకు సంబంధించిన కథనాలను పంచుకున్నారు. అదే విధంగా, ఢిల్లీ నివాసి వికాస్ జైన్ కూడా ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 2007లో వికాస్‌కి కంటి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు వికాస్ వయసు మూడేళ్లు మాత్రమే. అతని తల్లిదండ్రులు మొదట ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స ఇప్పించినప్పటికీ పెద్దగా ఉపశమనం కలగలేదు. అనంతరం వికాస్ ను ఢిల్లీ ఎయిమ్స్‌కి తీసుకుని వచ్చి చికిత్సను ఇప్పించడం మొదలు పెట్టారు. మూడు సంవత్సరాల చికిత్స తర్వాత.. వికాస్ కోలుకున్నాడు. 18 ఏళ్లు నిండిన వికాస్‌ ఇప్పుడు క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

 క్యాన్సర్ యుద్ధంపై యుద్ధం చేసి జయించిన 80 శాతం పిల్లలు ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్‌ ఆంకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ రచనా సేథ్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే చిన్నారుల్లో దాదాపు 80 శాతం మందికి ఈ వ్యాధి నయమైందని చెప్పారు. పిల్లలు క్యాన్సర్‌ను జయించాలని బలంగా కోరుకుంటారు. చికిత్సకు కూడా మెరుగ్గా స్పందిస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 70 వేల మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో ఏటా దాదాపు 400 కేసులు ఎయిమ్స్‌కు వస్తున్నాయి. ఈ పిల్లల్లో 80 శాతం మంది  క్యాన్సర్ ను జయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సకాలంలో గుర్తించడం చికిత్సనందిస్తే..  పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ని సకాలంలో గుర్తిస్తే చికిత్స ఇవ్వడం సులభమని డాక్టర్‌ సేథ్‌ చెబుతున్నారు. కంటి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ బారిన చిన్నారులు ఎక్కువగా పడుతున్నారని చెప్పారు. చాలా సందర్భాలలో, జన్యుపరమైన కారణాల వల్ల పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎయిమ్స్ లో చికిత్స అందించిన 250 మంది పిల్లలు క్యానర్ ను ఓడించి తమ జీవితాన్ని మరింత పొడిగించుకున్నారని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..