AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arthritis: ఆర్థరైటిస్ రోగులు అస్సలు తినకూడని ఆహారం ఇది.. తిన్నారో ఇక మీ ఇష్టం!

ఆర్థరైటిస్ బాధ నుంచి బయట పడేందుకు ఆహార పరంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టోమాటోను దూరం పెట్టాలంటున్నారు. ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ టోమాటోను తినకూడదని చెబుతున్నారు.

Arthritis: ఆర్థరైటిస్ రోగులు అస్సలు తినకూడని ఆహారం ఇది.. తిన్నారో ఇక మీ ఇష్టం!
arthritis
Madhu
|

Updated on: Jun 24, 2023 | 10:12 AM

Share

ఆర్థరైటిస్.. సాధారణంగా ఈవ్యాధి వయసు పైడిన వారిలోనే కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చిన్న వయసుల వారిలోనూ కీళ్ల నొప్పులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇధి ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మనలోని రోగ నిరోధక వ్యవస్థ మన ఎముకలు, కండరాలపై దాడి చేస్తుంది. నెమ్మదిగా మన కీళ్ళు ప్రభావితమవుతాయి. వాటి పనితీరు దెబ్బతింటుంది. కొన్ని రోజుల తర్వాత, ఇది చాలా తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. నడవడం కూడా కష్టం అవుతుంది. కీఫలితంగా కాళ్లు పట్టేయడం.. జాయింట్ల వద్ద వాపు రావడం మనం గమనిస్తాం. దీంతో వైద్యుల వద్దకు వెళ్లి పలు రకాల పరీక్షల అనంతరం వారి సిఫార్సు మేరకు మందులు వాడితే ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతాం. అయితే ఈ ఆర్థరైటిస్ బాధ నుంచి బయట పడేందుకు ఆహార పరంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టోమాటోను దూరం పెట్టాలంటున్నారు. ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ టోమాటోను తినకూడదని చెబుతున్నారు. అది ఎందుకు? ఒకవేళ తింటే ఏమవుతుంది? తెలుసుకుందాం రండి..

టోమాటో ఎందుకు తీనకూడదు..

ఆయుర్వేదంలో మనిషికి కలిగిన వ్యాధి, ఆ వ్యక్తి శరీరాన్ని బట్టి ఆహారం అందిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఆర్థరైటిస్ రోగులకు, టోమాటో వారి బాధను మరింత పెంచుతాయని చెబుతున్నారు. ఎందుకంటే అవి కీళ్ల నొప్పులను వేగంగా పెంచుతాయట. టొమాటోలో విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి, దీని వలన కాల్షియం క్షీణిస్తుంది. తద్వారా ఎముకలు లోపలి నుంచి బోలుగా మారుతాయి. ఆర్థరైటిస్ పేషెంట్ రోజూ టొమాటోలు తీసుకుంటే కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అంతేకాక టోమాటో లు శరీరంలోని ఇతర భాగాలలో వాపును కూడా కలిగిస్తాయి. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, టొమాటోలు సోలనిన్ అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి. ఇది వాపును పెంచుతుందని పేర్కొంది.

ఇవి తీసుకోవడం మంచిది..

ఎవరైనా కీళ్లనొప్పులతో బాధపడుతుంటే ఆకుకూరలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. వెల్లుల్లి, పచ్చి పసుపు, బ్రోకలీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే లవంగం, దాల్చినచెక్క వంటి వంటి మూలికలను కూడా చేర్చుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

కాబట్టి, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఆర్థరైటిస్ రోగులు టోమాటోలను అస్సలు దగ్గరకు రానివ్వకపోవడం ఉత్తమం. అయితే వారు ఆకుపచ్చ ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..