Guava Leaves: ఆ సమస్యలున్న వారికి వరం జామాకుల రసం.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరంతే..

Guava Leaves Health Benefits: జామ పండు.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. జామపండును అన్ని వయసుల వారు ఇష్టపడుతారు. ఇది ఎన్నో సమస్యలకు దివ్వౌషధంలా పనిచేస్తుంది.

Guava Leaves: ఆ సమస్యలున్న వారికి వరం జామాకుల రసం.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరంతే..
Guava Leaves
Follow us

|

Updated on: Jun 24, 2023 | 12:40 PM

Guava Leaves Health Benefits: జామ పండు.. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. జామపండును అన్ని వయసుల వారు ఇష్టపడుతారు. ఇది ఎన్నో సమస్యలకు దివ్వౌషధంలా పనిచేస్తుంది. సాధారణంగా ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరచడానికి వినియోగిస్తారు. అయితే జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. అయితే, జామాకుల్లో దాగున్న గుణాలు, పోషకాల గురించి తెలుసుకుంటే.. మీరు ఖచ్చితంగా ఈ ఆకులను తినకుండా ఉండలేరు.

జామ ఆకులలో లభించే పోషకాలు..

మన శరీరానికి చాలా అవసరమైన పోషకాలు జామ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల్లో ఉండే క్యాల్షియం, పొటాషియం, సల్ఫర్, సోడియం, ఐరన్, బోరాన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి పోషక విలువలను మరింత పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

జామ ఆకులను ఎలా తినాలి..

పంటి నొప్పి: జామ ఆకులను పంటి నొప్పికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. మీరు దంతాల నొప్పితో బాధపడుతుంటే మీద దాని రసాన్ని తీసి పళ్లపై అప్లై చేయాలి. అంతే కాకుండా జామ ఆకులను లవంగాలతో మెత్తగా నూరి దంతాలపై రాసుకుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఊబకాయం: జామ ఆకులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఇది సిరల్లోని చెడు కొలెస్ట్రాల్, పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆకులను మిక్సీ గ్రైండర్‌లో గ్రైండ్ చేసి ఆ రసం తీసి తాగాలి. దీని ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

మధుమేహం: టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఆకులు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వీటి రసం తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం సులభం అవుతుంది. ఇంకా ఆరోగ్యం కూడా క్షీణించదు.

జీర్ణక్రియ: జామ ఆకుల రసం కడుపుకు మంచిదని, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. మీకు అతిసారం, గ్యాస్ లేదా ఏదైనా రకమైన కడుపు సమస్య ఉంటే, ఖచ్చితంగా ఈ ఆకుల రసాన్ని తీసుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం