AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆమెకు 45, అతనికి 25.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగిపోయారు.. చివరకు..

ఆమెకు 45, అతనికి 25 ఏళ్లు.. ఒక్క మిస్డ్‌ కాల్.. వారి మధ్య పరిచయానికి దారితీసింది. అదే ఫోన్​కాల్ వారి మధ్య బంధానికి తెరలేపింది. ఆ బంధం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరికి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పింది. తప్పు తెలుసుకొని పశ్చాతాపం పడే సమయానికి..

Hyderabad: ఆమెకు 45, అతనికి 25.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగిపోయారు.. చివరకు..
Hyderabad Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2023 | 12:17 PM

Share

ఆమెకు 45, అతనికి 25 ఏళ్లు.. ఒక్క మిస్డ్‌ కాల్.. వారి మధ్య పరిచయానికి దారితీసింది. అదే ఫోన్​కాల్ వారి మధ్య బంధానికి తెరలేపింది. ఆ బంధం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరికి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పింది. తప్పు తెలుసుకొని పశ్చాతాపం పడే సమయానికి ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మరొకరు భయంతో ప్రాణాలు వదిలేశారు. హయత్‌నగర్‌ రాజేష్‌ మృతి‌ కేసులో ఎన్నో ట్విస్టులు. మర్డర్‌ యాంగిల్‌ నుంచి.. చివరకు సూసైడ్‌గా సెటిల్‌ అయింది ఈ కేసు. టీచర్‌ ని ప్రేమించి.. విఫలమై.. ఆమెతో పాటు.. రాజేష్‌ కూడా చనిపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌ నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు క్లైమాక్స్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్మయం కలిగించే కీలక ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావు.. రాజేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ ఆ తరువాత సంచలన విషయం వెలుగు చూశాయి.

హయత్‌నగర్‌కు చెందిన టీచర్ సుజాత, రాజేశ్ మధ్య పరిచయం కూడా ఆసక్తికరంగా జరిగింది. సూజాత ఇచ్చిన ఒక మిస్డ్‌ కాల్‌ ద్వారా ఇద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ.. తరచూ వాట్సాప్ సందేశాలు పంపించుకోవడం.. ఫోన్ మాట్లాడుకోవడం వరకు వెళ్లింది. సుజాత డీపీని చూసి ఆమెకు వివాహం కాలేదని భావించాడు రాజేశ్. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల పరిచయం తర్వాత సుజాతకు వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. తనను సుజాత మోసం చేసిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రాజేశ్. అంతేకాదు ఆ తర్వాత ఆమెను దూరం పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అయితే, రాజేశ్‌ దూరం కావడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత ఆమె.. ఆసుపత్రిలో ఉన్న విషయం తెలియక రాజేశ్‌ ఆమె సెల్​ఫోన్‌కు​ వాట్సప్‌ సందేశాలు, కాల్స్‌ చేశాడు. పదే పదే రాజేశ్‌ ఫోన్‌ చేయడంతో ఆ ఫోన్‌ కుటుంబ సభ్యులు లిఫ్ట్‌ చేసి ఆయనకు వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. రాజేశ్‌ టీ షాప్‌ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన సుజాత కుటుంబ సభ్యులు.. వెంచర్‌ వద్దకు తీసుకెళ్లి మందలించారు. ఆ తర్వాత సుజాత పరిస్థితి మరింత విషమంగా ఉందని రాజేశ్‌కు ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న సుజాత మృతి చెందింది. దీంతో బయపడిన రాజేశ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇలా ఒక్క మిస్డ్ కాల్.. రెండు ప్రాణాలను బలితీసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..