ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి, భాధ్యతలు ఇలా ఎన్నో సమస్యలతో పురుషులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలతో పాటు లైంగిక పరమైన సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే, పురుషుల లైంగిక జీవితం సంతోషంగా ఉంటే అది నేరుగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరానికి తగినంత పోషకాహారం లభించడంలేదు. ఈ రోజుల్లో నపుంసకత్వం పెద్ద వ్యాధిగా మారడానికి కారణం ఇదేనంటున్నారు వైద్య నిపుణులు.