Bank Deposits: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేస్తున్నారా..? అధిక వడ్డీతో మెరుగైన రాబడి

ఈ బ్యాంకు బల్క్ ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధికి 4.75% నుంచి 6.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి..

Subhash Goud

|

Updated on: May 20, 2023 | 7:16 PM

ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధికి 4.75% నుంచి 6.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఒక సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు గరిష్టంగా 7.25% రాబడిని పొందుతాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త బల్క్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు  మే 20, 2023 నుంచి అమలులోకి వస్తాయి.

1 / 5
7 రోజుల నుంచి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల బ్యాంక్ 4.75% వడ్డీ రేటును అందిస్తోంది మరియు ఐసీఐసీఐ బ్యాంక్ 30 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.50% వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 46 రోజుల నుంచి 60 రోజుల FDలపై 5.75% వడ్డీ రేటును, 61 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 6.00% వడ్డీ రేటును అందిస్తోంది. 91 రోజుల నుంచి 184 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు ఇప్పుడు 6.50% వడ్డీ రేటు, 185 రోజుల నుంచి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటికి 6.65% వడ్డీ రేటు లభిస్తుంది.

2 / 5
271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే బల్క్ ఎఫ్‌డిలపై, బ్యాంక్ 6.75% వడ్డీ రేటును అందిస్తోంది మరియు 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు మెచ్యూర్ అయ్యే వాటికి ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు 7.25% వడ్డీ రేటును అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుంచి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 7% వడ్డీ రేటును, 2 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే FDలపై 6.75% వడ్డీ రేటును అందిస్తోంది.

3 / 5
మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం డిపాజిట్లు 10.9% పెరిగి రూ. 1,180,841 కోట్లకు చేరుకున్నాయని, సగటు CASA నిష్పత్తి 43.6%గా ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దేశీయ రుణ పోర్ట్‌ఫోలియో సంవత్సరానికి 20.5% పెరిగింది. అయితే నికర ఎన్‌పీఏ నిష్పత్తి Q3FY23లో 0.55% నుంచి Q4FY23లో 0.48%కి తగ్గింది.

4 / 5
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం.. దాని స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి Q4FY23లో 2.81%కి పడిపోయింది. Q3FY23లో 3.07% నుంచి తగ్గింది. నికర నిరర్థక ఆస్తులు సంవత్సరానికి 25.9%, వరుసగా 8.8% తగ్గి రూ.5,155 కోట్లకు చేరుకున్నాయి. నికర వడ్డీ ఆదాయం (NII) Q4-2023లో 40.2% పెరిగి Q4-2022లో రూ. 12,605 కోట్ల నుంచి రూ. 17,667 కోట్లకు చేరుకుంది.

5 / 5
Follow us