AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే.. షాకింగ్‌ వీడియో వైరల్‌

ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇటీవల వరుస గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇళ్ల బయట, కాంపౌండ్‌ వాల్‌ లోపల ఉంచిన సిలిండర్లను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా తాళం వేసి ఉన్న ఒక ఇంటిని గమనించిన దుండగులు, ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి వంట గది బయట ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సమీపంలోని సిసిటివి (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

అమ్మ బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Lpg Cylinder Theft Karnataka
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2026 | 3:27 PM

Share

కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నం పట్టణంలో దొంగలు కొత్త దారి పట్టారు. నగలు, నగదు మాత్రమే కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కూడా కన్నేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇక్కడి నివాస ప్రాంతాల్లో వరుసగా గ్యాస్ సిలిండర్లు మాయమవుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని ఒక కాలనీలో నివసిస్తున్న ఒక కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఇదే అదునుగా కొందరు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ టూవీలర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంటి ఆవరణలోకి చొరబడ్డారు. బయట స్టాండ్‌లో ఉంచిన నిండు గ్యాస్ సిలిండర్‌ను చాకచక్యంగా విడదీసి ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి యజమాని గమనించేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు.

ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు అత్యంత వేగంగా సిలిండర్‌ను బైక్‌పై పెట్టుకుని పరారవ్వడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే వారు ఈ పని ముగించుకుని వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై బాధితులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్లను ఇంటి బయట లేదా సులభంగా దొరికే ప్రాంతాల్లో ఉంచవద్దని, వాటికి గొలుసులతో తాళం వేయడం లేదా సురక్షితమైన గదుల్లో ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

ఒకవైపు గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతుంటే, మరోవైపు ఇలాంటి దొంగతనాలు జరగడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. పాత సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ముఠాలు ఈ పని చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని చెన్నపట్నం వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్