AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannath : ఎంత మారిపోయింది భయ్యా.. పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో పాత్రలకు కొత్త మెరుగులు దిద్దిన దర్శకుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో నెట్టుకొస్తున్న పూరి.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు.

Puri Jagannath : ఎంత మారిపోయింది భయ్యా.. పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2026 | 3:28 PM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా కాలంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. పూరి సినిమా అయితే చాలు హీరోహీరోయిన్ల గురించి జనాలు అంతగా పట్టించుకోరు. యువతను ఆకట్టుకునే కథలు.. డైలాగ్స్ తో కుర్రకారును ఊర్రూతలూగిస్తారు. అలాగే కుర్రకారు మెచ్చేలా హీరో పాత్రలకు యాటిట్యూడ్, ఎలవేషన్ ఇస్తుంటారు. అందుకే పూరి సినిమాలకు, ఆయన మేకింగ్, డైరెక్షన్ అంటే కుర్రాళ్లు పడిచచ్చిపోతారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పూరి.. ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ శంకర్ 2 సినిమా సైతం అంతగా మెప్పించలేదు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.మరోవైపు పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసిన ఆకాష్.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. ఇక పూరి తనయ సైతం ఒకప్పుడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పూరి కూతురి పేరు పవిత్ర. చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో పూరి కూతురు పవిత్ర నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. ఓవైపు ఆకాష్ హీరోగా వరుస సినిమాలు చేస్తుంటే.. మరోవైపు పవిత్ర మాత్రం చదువులపై దృష్టి పెట్టింది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

Follow Us