AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ్ స్టార్ హీరో ఏంజీఆర్ గురించి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

Rajendra Prasad: తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
Rajendra Prasad
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2026 | 3:56 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాల్లో ఆయన చేసిన కామెంట్స్ చిక్కుల్లో పడేస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో లెజండరీ యాక్టర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళుల ఆరాధ్య నటుడిపై ఇలాంటి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడంపై సినీ ప్రముఖులు, తమిళులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదం పై స్పందించిన రాజేంద్రప్రసాద్.. తన మాటలకు వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు. తమిళంలో మాట్లాడుతూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

“తమిళ సినీ ప్రేక్షకుల మాదిరిగానే నేనూ ఎంజీఆర్ ను దైవంలా భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే సమయంలో నోరుజారాను. అయితే అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావు. కొందరు ఈ అంశాన్ని పెద్దది చేశారు. ఆయనపై వ్యాఖ్యలు చేసేంత ధైర్యం నాకుందా ? నేను చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూ్ట్ లో ఉండగా.. ఆయన సీఎంగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడగలనా ? నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయను” అని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఇదివరకే రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ పై తమిళ నటుడు విశాల్, నాజర్ స్పందించారు. ఎంజీఆర్ గురించి చౌకబారు పోలికతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం దిగ్ర్భాంతిని కలిగించింది. ఆయన చేసిన కామెంట్స్ ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయి. వెంటనే రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us