శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఖాజావుద్దీన్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. శవయాత్ర వెళ్తుండగా హారన్ కొట్టాడన్న నెపంతో బస్సును ఆపి, డ్రైవర్ను చితకబాదారు. కండక్టర్ గీతాంజలిని కూడా దుర్భాషలాడి ఆమె ఫోన్ ధ్వంసం చేశారు. డ్రైవర్ ఆసుపత్రిలో చేరగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.