AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Das: బ్రేకప్ పై అర్జున్ దాస్ ఎమోషనల్ కామెంట్స్.. ప్రతి అబ్బాయి హృదయాన్ని కదిలించాడు భయ్యా..

ఇటీవల సినీరంగంలో సెలబ్రెటీల ప్రేమ, పెళ్లి, విడాకుల విషయాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొందరు స్టార్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మరికొందరు డివోర్స్ తీసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నటుడు అర్జున్ దాస్ షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Arjun Das: బ్రేకప్ పై అర్జున్ దాస్ ఎమోషనల్ కామెంట్స్.. ప్రతి అబ్బాయి హృదయాన్ని కదిలించాడు భయ్యా..
Arjun Das
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2026 | 2:58 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అర్జున్ దాస్. సహజమైన నటన, విలక్షణమైన గొంతుతో ప్రేక్షకులను మెప్పించాడు. తమిళం, మలయాళం, తెలుగు భాషలలో తనదైన ముద్ర వేశాడు. ఆయనకన్నా ఆయన గొంతుకే ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ హీరో పాత్రలతోపాటు విలన్ పాత్రలతోనూ మెప్పించాడు. ఎప్పుడు జావియల్ గా, సరదాగా ఉండే అర్జున్ దాస్.. ఇప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాల చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్, ప్రొఫెషనల్ విషయాలు మాత్రమే పంచుకునే అర్జున్ దాస్.. ఆకస్మాత్తుగా బ్రేకప్ స్టోరీ పెట్టాడు. హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టడంపై నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో “మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే.. వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు ? ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం అర్జున్ దాస్ చేసిన బ్రేకప్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అర్జున్ దాస్ నిజంగానే ప్రేమలో విఫలమయ్యారా.. ? ఆయన వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషాదం చోటు చేసుకుందా ? అనే చర్చ మొదలైంది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

అయితే అర్జున్ దాస్ ప్రేమ విషయం ఎప్పుడూ నెట్టింట చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు ఆయన బ్రేకప్ విషయం మాత్రం నెట్టింట వైరలవుతుండగా.. కొందరు ఆయనకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో సినిమా అప్డే్ట్ లేదా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ దాస్ బుట్టబొమ్మ చిత్రంలో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us