- Telugu News Photo Gallery Business photos 2000 rupees note: Can 2000 rupees notes be exchanged without a bank account? Know what RBI rules
2000 Rupee Note: బ్యాంకు ఖాతా లేకుండా రూ. 2000 నోట్లను మార్చవచ్చా.. RBI నియమం ఏంటో తెలుసుకోండి..
మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంంది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.బ్యాంకు ఖాతా లేకుండా రూ. 2000 నోట్లను మార్చవచ్చో ఆర్బీఐ చాలా క్లుప్తుంగా వివరించింది.
Updated on: May 21, 2023 | 6:56 AM

రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే 19 శుక్రవారం ప్రకటించింది. అయితే, అధికారికంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను మార్చుకోవాలని సూచించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నోట్లు సెప్టెంబర్ 30, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. ఈ నోట్లను తీసుకోవడానికి ఎవరూ నిరాకరించలేరని కూడా తెలిపింది.

రూ. 2000 నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రజల మదిలో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోతే, అతను నోట్లను ఎలా మార్చుకుంటాడు.


బ్యాంకు నోట్ల మార్పిడి కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించలేరు. దీంతో రూ.20 వేల కంటే ఎక్కువ నోట్లను ఒకేసారి మార్చడం లేదు.

నోట్ల మార్పిడికి బ్యాంకులకు ఆర్‌బీఐ ప్రత్యేక మార్గదర్శకం జారీ చేసింది, దీని ప్రకారం బ్యాంకులు నోట్ల మార్పిడికి ప్రత్యేక విండోను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు బ్యాంకులు కొత్త రూ. 2000 నోట్ల జారీని తక్షణం అమల్లోకి తెచ్చాయి.

ఆర్బీఐ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా పది నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. అయితే, అతను తన బ్యాంక్ ఖాతాలో కూడా డిపాజిట్ చేయవచ్చు. ఒక వ్యక్తి తన ఖాతాలో జమ చేయడం ద్వారా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాలనుకుంటే, అతను కోరుకున్నన్ని నోట్లను డిపాజిట్ చేయడం ద్వారా వాటిని మార్చుకోవచ్చు. అయితే, అతని ఖాతాకు కేవైసీ తప్పనిసరిగా ఉండాలి. కేవైసీ లేనిదే రూ.2,000 నోట్లు ఖాతాలో జమ కావని కూడా బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.

గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకుంటున్నారు.





























