టాటా హారియర్ ఈవీ.. ఒమేగా, జెన్ 2 ఆర్కిటెక్చర్ ప్రకారం దీనిని తయారు చేస్తున్నారు. దీనిలో ఆధునిక లైటింగ్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్, ఏడబ్ల్యూడీ టెక్నాలజీ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉంటాయి. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఆల్-వీల్ డ్రైవ్ ను అందిస్తోంది. ఈ కారు కూడా 2025 ఏప్రిల్ నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ. 30లక్షలు ఉంటుందని చెబుతున్నారు.