AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

Phani CH
|

Updated on: Mar 13, 2026 | 5:01 PM

Share

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న భారతీయ మహిళ అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భారత్‌కు వచ్చారు. వీసా అపాయింట్‌మెంట్లు దొరకకపోవడంతో ఆమె ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో అమెరికాలోని ఆమె ఉద్యోగం, ఇల్లు, జీవితం ప్రమాదంలో పడ్డాయి. ఈ సంక్షోభం ఎంతోమంది హెచ్‌-1బీ వీసాదారుల సమస్యలను ప్రతిబింబిస్తోంది. తాత్కాలిక వీసాపై ఆధారపడటం ఎంత కష్టమో ఇది తెలియజేస్తోంది.

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తూ స్థిరపడిన ఓ భారతీయ మహిళ, తన జీవితంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు భారత్‌కు వచ్చిన ఆమె, తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీసా అపాయింట్‌మెంట్లు అందుబాటులో లేకపోవడంతో ఆమె ఉద్యోగం ప్రమాదంలో పడింది. ఏళ్ల తరబడి నిర్మించుకున్న జీవితం కళ్ల ముందే కూలిపోతుండటంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు ఒకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడిట్’ ద్వారా షేర్‌ చేసారు. ‘తన స్నేహితురాలు తన తల్లి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె జీవితం, ఇల్లు, ఉద్యోగం, బాధ్యతలు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ఇంటి లోన్, కారు లోన్ ఈఎంఐలు ఆగవు కదా’ అంటూ ఆయన తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. వీసా స్లాట్ దొరకకపోతే, అమెరికాలోని తన ఇల్లు, ఇతర ఆస్తులను అమ్ముకోవడానికి కూడా ఆమె సిద్ధపడుతున్నారని తెలిపారు. హెచ్‌-1బీ వీసాదారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం కొత్తేమీ కాదు. ఇటీవల అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేయడం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించడం వంటి చెకింగ్‌లతో వీసా ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెడిట్ గ్రూపులో పెట్టిన ఈ పోస్ట్ వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. కుటుంబానికి దూరంగా విదేశాల్లో ఉంటున్న అనేక మంది ఈ కథనంతో ఏకీభవించారు. “తాత్కాలిక వీసాను శాశ్వత నివాసంగా భావించకూడదు. ఈ నిబంధనలు ఎప్పుడైనా మారవచ్చు. జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా అదే నిజం” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Follow Us