కట్టెల పొయ్యి మీద చేప లేకుండానే చేపల పులుసు 5 నిమిషాల్లో ఇలా ఈజీగా..
Prasanna Yadla
13 March 2026
Pic credit - Pixabay
చేపలు అస్సలు వాడకుండానే చేపల పులుసు ఈజీగా చేసేయోచ్చు. ఎలాగా అని ఆలోచిస్తున్నారా?
వెజ్ చేపల పులుసు
చేపలు అస్సలు వాడకుండానే చేపల పులుసు ఈజీగా చేసేయోచ్చు. ఎలాగా అని ఆలోచిస్తున్నారా?
చేపలు వాడకుండానే చేపల పులుసు
ఎక్కువ ఆలోచించకండి. వెజ్ తో కూడా చేపల పులుసు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
వెజ్ తో కూడా చేపల పులుసు
రెండు అరటికాయలు, చింతపండు, మూడు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నాలుగు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, కొత్తిమీర, ఉప్పు, కారం, అర టీ స్పూన్ పసుపు , నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా అరటికాయలను తీసుకుని వాటిని ఫిష్ ముక్కల వలె కట్ చేసుకోవాలి. వాటికి కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ -1
దీనిని అరటికాయ ముక్కలను బాగా పట్టించి దానిలోనే అన్ని రకాల మసాలా పొడులు వేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
కట్టెల పొయ్యి మీద పాన్ పెట్టి ఆవాలు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.
స్టెప్ -2
ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది వేయించిన తర్వాత చింత, అరటికాయ ముక్కలు, బాగా ఉడికించుకోవాలి అలా 10 నిముషాలు ఉంచి చివర్లో కొత్తిమీర చల్లి అన్నంలో వేసుకుని తినడమే.