AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

Phani CH
|

Updated on: Mar 13, 2026 | 6:12 PM

Share

మెట్రో ప్రయాణికులకు PhonePe, హైదరాబాద్ మెట్రో సంయుక్తంగా 'ఆన్-ది-గో' రూపే కార్డును ప్రవేశపెట్టాయి. NCMC పరిధిలోని ఈ కార్డుతో ఇంటర్నెట్ లేకపోయినా 'ట్యాప్-అండ్-పే' ద్వారా తక్షణ చెల్లింపులు చేయవచ్చు. క్యూలు, చిల్లర సమస్యలు లేకుండా మెట్రో ప్రయాణం సులభతరం చేస్తుంది. UPI ద్వారా రూ. 2,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా NCMC సేవలున్న మెట్రో, బస్సులు, టోల్‌ప్లాజాలలో ఉపయోగపడుతుంది, సమయాన్ని ఆదా చేస్తుంది.

మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూలు, చిల్లర సమస్యలు, అన్నింటికీ మించి ఆన్‌లైన్ పేమెంట్ చేసే సమయంలో ఎదురయ్యే నెట్‌వర్క్ ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ PhonePe, హైదరాబాద్ మెట్రో సహకారంతో ‘ఆన్-ది-గో’ రూపే కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ‘నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు’ పరిధిలో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా, సిగ్నల్ సరిగ్గా లేకపోయినా మెట్రో గేట్ల వద్ద కేవలం ‘ట్యాప్-అండ్-పే’ పద్ధతిలో తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. ప్రయాణికులు మెట్రో స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ వెరిఫికేషన్‌తో కార్డు యాక్టివేట్ అవుతుంది. ఇది ప్రీపెయిడ్ విధానంలో పనిచేస్తుంది కాబట్టి, యూపీఐ ద్వారా గరిష్ఠంగా రూ. 2,000 వరకు బ్యాలెన్స్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా NCMC వ్యవస్థ ఉన్న అన్ని మెట్రోలు, బస్సులు, టోల్‌ప్లాజాలు మరియు పార్కింగ్ కేంద్రాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. నిత్యం ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది ఎంతో సమయాన్ని ఆదా చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సరికొత్త సేవలతో హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Follow Us