AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annadata Sukhibhava: ఏపీ రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్.. చెక్ చేసుకున్నారా..?

ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ తీపికబురు అందించింది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇవాళ రూ.6 వేలు జమ చేసింది. రైతుల అకౌంట్లో ఇవి జమ అయ్యాయి. అటు పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కూడా ఏపీ రైతులకు జమ అయ్యాయి.

Annadata Sukhibhava: ఏపీ రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్.. చెక్ చేసుకున్నారా..?
Annadata Sukhibhava
Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 6:12 PM

Share

ఏపీ రైతులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని స్వయంగా తన చేతుల మీదుగా నిధులు విడుదల చేశారు. దీంతో ఏపీలోని రైతులకు ఒక్కొక్కరికీ రూ. 6 వేలు జమ అయ్యాయి. కొద్దిసేపటి క్రితం అస్సాంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో ఏపీలోని పీఎం కిసాన్ లబ్దిదారులకు రూ.2 వేలు కేంద్రం నుంచి జమ కాగా.. అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వం రూ.4 వేలు జమ చేసింది. దీంతో ఏపీలోని రైతుల అకౌంట్లలో ఒకేసారి రూ.6 వేలు జమ అయ్యాయి.

ఏపీ రైతుల అకౌంట్లో రూ.6 వేలు జమ

అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం కింద ఇవాళ 46.85 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.2,676 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వీటిల్లో ఏపీ ప్రభుత్వం వాటా రూ.1,874 కోట్లు ఉండగా.. కేంద్ర వాటా రూ.802 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం మొదటి, రెండో విడత కలిపి ఒక్కో రైతుకు రూ.14వేలు అందించింది. ఇప్పుడు మూడో విడతతో కలిపి ఒక్కో రైతుకు మొత్తం రూ.20వేలు అందించింది. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14 వేలు ఇస్తోండగా.. పీఎం కిసాన్ కింద రూ.6 వేలు అందుతున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇది ఉపయోగపడుతుంది.

పీఎం కిసాన్ రోజే..

పీఎం కిసాన్ పథకంతో కలిసే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎం కిసాన్ కేంద్రం రిలీజ్ చేసే రోజు అన్నదాత సుఖీభవ డబ్బులను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో రైతులకు రెండు రకాలుగా లబ్ది చేకూరుతుంది. రైతులు వీటిని తమ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. ఇక అన్నదాత సుఖీభవ వెబ్ సైట్లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీకు డబ్బులు పడ్డాయా.. లేదా అనే స్టేటస్ కూడా ఆ వెబ్ సైట్‌లో చూసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.

Follow Us