AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Public Exams 2026: పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో..

10th Class Public Exams 2026: పదో తరగతి విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
AP SSC 10th Class Public Exams
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 1:39 PM

Share

అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు వీలుగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. మొబైల్‌తో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడుందో సులువగా తెలుసుకోవచ్చు. అలాగే హాల్‌ టికెట్‌ చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా పదో తరగతి హాల్‌టికెట్‌పై పరీక్షలకు సంబంధించి విద్యార్ధుల్లో ఒత్తిడి దూరం చేయడానికి ఒక సబ్జెక్ట్ మరో సబ్జెక్ట్‌ మధ్య సెలవులు వచ్చేలా టైం టేబుల్ రూపొందించారు.

అలాగే ఏపీ ప్రభుత్వం ఈసారి పదో తరగతి పరీక్షలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులకు నిమిషం నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. సాధారణంగా 5 నిమిషాల వరకు గ్రేస్‌ టైం ఇస్తుంటారు. అయితే పదో తరగతి విద్యార్ధులకు మాత్రం ఏకంగా అరగంట గ్రేస్‌ పిరియడ్‌ ఇచ్చింది. అయితే ప్రతి రోజూ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుంది. ఎగ్జామ్ సెంటర్‌లలోకి విద్యార్థులను మాత్రం ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత కూడా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ఇక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 13 వరకు మూల్యాంకన కొనసాగుతుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు రోజుకు 40 చొప్పున జవాబుపత్రాలు మూల్యాంకనం చేసి, ఆ తర్వాత మార్కుల లెక్కింపులో తప్పులు జరగకుండా ట్యాబ్‌ల్లో నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us