ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం శుక్రవారం అన్నదాత సుఖీభవ 3.0 పథకం కింద నిధులను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు రూ. 6,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమకానున్నాయి. కృష్ణా జిల్లా సూరంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతులు ఈ పెట్టుబడి సాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.