AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కావలసినంత గ్యాస్ ఉందని.. జనాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అపోహలను అడ్డు పెట్టుకుని బ్లాక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.జిల్లాలో సమన్వయ కమిటీలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

LPG Gas: ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మన దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడటం, ఇటీవల గ్యాస్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కుటుంబాలు ఒక సిలిండర్‌ను ఎక్కువ రోజులు ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్నట్లుగా కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే గ్యాస్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Anand T
|

Updated on: Mar 13, 2026 | 5:11 PM

Share

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కావాల్సినంత గ్యాస్ ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్యాస్ సరఫరాలో గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థల పాటు ప్రభుత్వ సంస్థలు, ఆశ్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

రాష్ట్రంలో కోటి 29 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రతి రోజు 2 లక్షల 5 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయన్నారు . రాష్ట్రంలో 810 LPG డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా అవుతుందన్నారు. రాష్ట్రంలో బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదన్నారు మంత్రి. బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సూచించారు.

అయితే డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపై అధికారులు దాడులు నిర్వహించారు. హోటళ్లలో వాడుతున్న డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 50 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన దాడుల్లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 34 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
నలుగురు స్నేహితుల జలసమాధి!
నలుగురు స్నేహితుల జలసమాధి!
ఇంటి ముందున్న తులసి మొక్కే ఆరోగ్యానికి అసలైన బాడీగార్డ్! ఆ పవర్
ఇంటి ముందున్న తులసి మొక్కే ఆరోగ్యానికి అసలైన బాడీగార్డ్! ఆ పవర్