AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ATM తరహాలో క్విక్ ప్రింట్ మెషిన్స్.. స్కాన్ చేసిన క్షణాల్లోనే..

Hyderabad Qwick Print Kiosk Facility :హైదరాబాద్‌ ప్రజలకు కొత్త సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇక జిరాక్స్ షాపుల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఏటీఎం తరహా 'క్విక్ ప్రింట్' మిషన్లు నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఫైల్ అప్‌లోడ్ చేసి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి క్షణాల్లో ప్రింట్స్ తీసుకోవచ్చు. ప్రస్తతం కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ATM తరహాలో క్విక్ ప్రింట్ మెషిన్స్.. స్కాన్ చేసిన క్షణాల్లోనే..
Quick Print Hyderabad
Anand T
|

Updated on: Mar 13, 2026 | 12:05 PM

Share

సాధారణంగా మనకు ఏదైనా ప్రింట్ కావాలి అనుకుంటే వెంటనే జిరాక్స్ షాప్‌ల కోసం వెతుకుతాం. అక్కడికి వెళ్లి ప్రింట్ తీసుకుంటాం. ఒక వేళ మనకు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ షాప్‌లు లేకపోతే ఇక అంతే సంగతులు. కానీ హైదరాబాదీలకు ఇకపై ఆటెన్షన్ లేనట్టే. ఎందుకంటే ఇప్పడు హైదరాబాద్‌వాసులకు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం తరహాలో నగరంలో క్విక్ ప్రింట్ పేరుతో సరికొత్త ప్రింటింగ్ మిషన్‌లు ఏర్పాటు అవుతున్నాయి. మీకు ఏదైనా ప్రింట్ కావాలి అనుకుంటే ఈ క్విక్ ప్రింట్ మిషన్స్ దగ్గరకు వెల్లి మీ మొబైల్ ద్వారా మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కావాల్సిన ప్రింట్‌ను క్షణాల్లో పొందవచ్చు.

ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీ హైదరాబాద్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలోకి కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ కియోస్క్‌ క్విక్ ప్రింట్ మిషన్‌లను ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన ఇద్దరు యువకులు ఈ మిషన్‌ను కూకట్‌ పల్లి మెట్రో వద్ద ఇన్‌స్టాల్ చేశారు. ఏదైనా ప్రింట్ కావాలి అనుకున్న వారు ఇక్కడ మిషన్‌ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రింట్‌ను పొందుతున్నారు.

క్విక్ ప్రింట్ మిషన్‌లో ప్రింట్ ఎలా తీసుకోవాలి

  • ఈ క్విక్ ప్రింట్ మిషన్ ద్వారా మీరు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా ఈ కియోస్క్‌ మెషిన్‌పై ఉన్న ‘క్యూఆర్‌’ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
  • తర్వాత మీ మొబైల్‌లో ఫైల్‌ అప్‌లోడ్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది
  • అప్పుడు మీరు ఏదైతే ప్రింట్ కావాలి అనుకుంటున్నారో ఆ ఫైల్‌పై క్లిక్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి
  • తర్వాత మీకు కలర్‌ ఆర్ బ్లాక్ అండ్‌వైట్ ఏ ప్రింట్ కావాలి అనే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఆ ఏది కావాలో ఆ ఆప్షన్స్ సెలక్ట్ చేయగానే మీకు యూపీఐ పేమెంట్‌ ఆప్షన్‌ చూపిస్తుంది.
  • అందులో చూపింన డబ్బును మీరు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
  • పేమెంట్ పూర్తైన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది
  • దానిని ఎంటర్ చేయగానే మీకు కావాల్సిన ప్రింట్‌లు మిషన్ నుంచి బయటకు వస్తాయి.

ఇప్పుడు ఈ క్విక్ ప్రింట్ మిషన్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. జిరాక్స్ షాప్‌లకు వెళ్లే అవసరం లేకుండా ఇదేదో బాగుందని నెటిజన్‌లు అంటున్నారు. వీటిని నగర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తే చాలా బాగుంటుందని నగరవాసులకు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!