బాపట్ల జిల్లా ద్రోణాదుల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డిసెంబర్ 14న నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో, పెళ్లికూతురు దివ్య, ఆమె తల్లి సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. వరుడి మోసం వల్లే ఈ ఘోరం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.