మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జెండా దిమ్మె ఏర్పాటుపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాత ప్రజారాజ్యం దిమ్మె స్థానంలో జనసేన జెండా నిర్మించేందుకు ప్రయత్నించగా, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం దిమ్మె అంటూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు, ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెట్ కొనసాగుతోంది.