Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్.. 24 గంటల పాటు సరఫరా.. ఆందోళన లేనట్లే..
దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ కొరత దేశంలో లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. 24 గంటలపాటు పీఎన్జీ సరఫరా చేస్తామని, ప్రజలకు దీనికి కనెక్షన్ మార్చుకోవాలని సూచించింది. ఇంకా ఏమన్నారంటే..

దేశంలో వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దేశంలో గ్యాస్ కొరత లేదని ప్రకటన జారీ చేసింది. వంటగ్యాస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరం లేకపోయినా ఆందోళన పడి బుక్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ఇంధన కొరత, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలపై స్పందించారు. గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు, ప్రస్తుతం కంట్రోల్‌లోనే ఉందని స్పష్టం చేశారు.
24 గంటల పాటు సరఫరా
ఎల్పీజీకి బదులు పీఎన్‌జీని ప్రజలు ఉపయోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. 24 గంటల పాటు పీఎన్‌జీని సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో గ్యాస్ ఉత్పత్తి 32 శాతం పెరిగిందని, మార్చి 5తో పోలిస్తే పరిస్థితి మెరుగుపడిందని స్పష్టం చేసింది. దేశీయంగా ఉత్పత్తి పెరిగిలందని, ఎల్పీజీపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకుంటే మంచిదని సూచించింది. రాష్ట్రాలు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని, అక్రమార్కులకు అడ్డుకట్ల వేయాలని ఆదేశించింది. పెట్రోలియం కొరత లేదని, ప్రజలు ప్యానిక్ అవ్వొద్దని సూచనలు జారీ చేసింది. దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరుగుతున్నందన కొరత ఉండదని తేల్చిచెప్పింది. ప్రజలు ఆందోళన చెందుతూ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొరత మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది.
భయాందోళన చెందాల్సిన అవసరం లేదు
దేశంలో వంట గ్యాస్ డిమాండ్ సరళి మారిపోయిందని, ఇది భారీ భయాందోళనలకు గురిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. యుద్ధానికి ముందు సగటున 55.7 లక్షల ఎల్పీజీ బుకింగ్‌లు అయ్యేవని, అయితే ఇప్పుడు రోజుకు 75.7 లక్షలకు పెరిగాయని స్పష్టం చేసింది. ప్రజల్లో భయాందోళన ఎలా ఉందో చెప్పడానికి ఇదే ఒక నిదర్శనమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. పుకార్లు వ్యాప్తి చేయవద్దని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు తాను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నట్లు ఆమో అన్నారు. కాగా దేశంలో వాణజ్య సిలిండర్ కొరత ఉంది. దీని వల్ల ప్రధాన నగరాల్లో హోటల్స్ మూత పడుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఆహార పదార్థాలు లభించక ప్రజలు ఇబ్బంది పడే పరిస్ధితి రావొచ్చు.
