AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ప్రతి నెలా చేతికి ఖచ్చితంగా రూ.9250 రాబడి వచ్చేలా ఒక సురక్షితమైన పథకం ఉంటే ఎలా ఉంటుంది? మార్కెట్ రిస్క్ ఏమాత్రం లేకుండా మీ కష్టార్జితానికి పూర్తి భద్రతతో పాటు స్థిరమైన వడ్డీని ఇచ్చే మార్గం కోసం వెతుకుతున్నారా? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు.

పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Post Office Monthly Income Scheme
Krishna S
|

Updated on: Aug 11, 2026 | 6:46 PM

Share

ప్రస్తుత రోజుల్లో సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన సొమ్మును సరైన చోట పెట్టుబడి పెట్టి సురక్షితమైన రాబడి పొందడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు, మహిళలు, ప్రతి నెలా మంచి రాబడిని కోరుకునే వారి కోసం పోస్టాఫీస్‌లో ఎన్నో అద్భుత పథకాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పాపులర్ పథకం.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వ పూర్తి గ్యారెంటీతో నడిచే ఈ పథకంలో ఒకసారి డిపాజిట్ చేస్తే చాలు.. ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఖచ్చితంగా రూ.9250 వరకు స్థిరమైన వడ్డీ ఆదాయాన్ని మీ చేతికి అందిస్తుంది.

పథకం ముఖ్య వివరాలు

కాలపరిమితి: ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఐదేళ్ల పాటు మీ డిపాజిట్ భద్రంగా ఉంటుంది.

ఆకర్షణీయమైన వడ్డీ రేటు: ప్రస్తుతం ఈ పథకంపై సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.

సింగిల్ అకౌంట్: గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

జాయింట్ అకౌంట్: దంపతులు లేదా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

నెలకు రూ. 9,250 రాబడిని ఎలా పొందవచ్చు?

పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని గరిష్ట పరిమితిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ పథకం నుండి నెలకు రూ.9250 ఆదాయాన్ని సంపాదించవచ్చు.

పెట్టుబడి మొత్తం: మీరు భార్యాభర్తలు కలిసి ఒక జాయింట్ ఖాతా తెరిచి గరిష్ట పరిమితి ప్రకారం రూ.15 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం.

వార్షిక వడ్డీ లెక్కింపు: 7.4శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 15 లక్షల అసలుపై సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది.

నెలవారీ చెల్లింపు: ఈ రూ.1,11,000 వార్షిక వడ్డీని 12 నెలలకు విభజిస్తే.. మీకు ప్రతి నెలా రూ.9,250 మీ ఖాతాలోకి జమ అవుతుంది.

అంటే ఐదేళ్ల కాలంలో మీరు పెట్టిన రూ. 15 లక్షల అసలు అలాగే భద్రంగా ఉంటుంది. దాంతో పాటు ప్రతీ నెలా రూ.9,250 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం రూ.5,55,000 ల వడ్డీ ఆదాయాన్ని మీరు పొందుతారు. మెచ్యూరిటీ ముగిశాక మీ రూ.15 లక్షలను తిరిగి వెనక్కి తీసుకోవచ్చు లేదా కావాలంటే పథకాన్ని పొడిగించుకోవచ్చు.

ఈ పథకం ఎవరికి  ఉపయోగపడుతుంది?

  • పదవీ విరమణ పొందిన వారు తమకు వచ్చిన గ్రాట్యుటీ, పిఎఫ్ మొత్తాన్ని ఇందులో డిపాజిట్ చేసి, పెన్షన్ తరహాలో నెలకు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
  • నెలకు తగినంత నిలకడైన ఆదాయం కోరుకునే మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం.
  • మార్కెట్ రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడి కోరుకునే వారికి ఇది సరైన వేదిక.

మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, చెక్ బుక్ ద్వారా చాలా సులభంగా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతాను తెరవవచ్చు.

Follow Us
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..