ఆధార్ ఉంటే చాలు.. కేంద్రం నుంచి రూ.10 లక్షల లోన్

Venkatrao Lella

Images: Pinterest

08 AUG 2026

దరఖాస్తుదారుడు భారత పౌరుడై అయి ఉండాలి. ఒక చిన్న భాగస్వామ్య సంస్థను స్వంతంగా కలిగి ఉండాలి లేదా నిర్వహిస్తూ ఉండాలి. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారికి రుణం అందుతుంది

దరఖాస్తుదారుడికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. వయస్సు 65 సంవత్సరాలు కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు

ట్రేడింగ్, తయారీ, సేవలు వంటి రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తూ ఉండాలి. రుణాలను వ్యవసాయేతర సంబంధిత వ్యాపార కార్యకలాపాల కోసం మాత్రమే ఉపయోగించాలి.

PMMY పథకం కింద అనుమతించబడిన గరిష్ట రుణ మొత్తం రూ. 10 లక్షలుగా ఉంది. మీ రుణ అవసరం తప్పనిసరిగా రూ. 10 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.

ఈ పథకం ద్వారా ఒక వ్యాపార సంస్థకు రూ. 10 లక్షల వరకు రుణం అందిస్తారు. MSMEలు, స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాల విస్తరణను ప్రోత్సహించేలా ఈ రుణ నిబంధనలు రూపొందించారు. అత్యధిక రుణ మొత్తం రూ. 10 లక్షలుగా ఉండాలి. 

బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు, మైక్రోఫైనాన్స్ సంస్థల వంటి రుణ సంస్థలకు ఇచ్చిన సూచనల ప్రకారం.. రుణ పంపిణీ సరళంగా, అవాంతరాలు లేకుండా ఉండాలి. చాలా చిన్న యూనిట్లలో బ్యాంకును సంతృప్తి పరచడానికి అవసరమైన పత్రాలు ఉండవు.

కంపెనీలో ఉపయోగించే పనిముట్లు, యంత్రాల కొనుగోలు వంటి వివిధ వ్యాపార అవసరాల కోసం ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. బ్రాండ్ ప్రచారం లేదా సంస్థ ప్రాంతీయ అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం కూడా PMMY రుణాన్ని ఉపయోగించుకోవచ్చు

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు రెండు కాపీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించిన పత్రాలు అవసరం

తమ రోజువారీ వ్యాపార అవసరాల కోసం ముద్రా లోన్ తీసుకున్నవారు డెబిట్ కార్డులతో సమానమైన ముద్రా కార్డులను ఉపయోగించవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత రుణదాత రుణగ్రహీత కోసం ఒక ముద్రా ఖాతాను ఏర్పాటు చేస్తారు.