వార్ ఎఫెక్ట్.. కేజీ టమోటా రూ.250, ఉల్లిపాయ 175.. కన్నీళ్లు పెట్టిస్తు్న్న కూరగాయల ధరలు!
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో మధ్యప్రాచ్యం రగిలిపోతోంది. ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపై పడుతుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడడంతో వాటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని దేశాల్లో అయితే కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దుబాయ్‌లో ఏకంగా కేజీ టమోటా రూ.250 పలుకుతోంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఈ యుద్ధం తీవ్ర మరింత తీవ్రతరం అయింది. అయితే తమ ప్రధాని మరణం తర్వాత ఇరాన్ అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ కంట్రీస్‌పై దాడులను పెంచింది. దీంతో దుబాయ్ సహా అనేక దేశాలపై మిసైళ్ల వర్షం కురిపింది. ఈ ప్రభావం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ద్రవ్యోల్బణం పరిస్థితులకు దారి తీసింది. యుద్ధ వాతావరణంతో దుబాయ్‌లో నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశానంటుతున్నాయి.
ఖలీజ్ టైమ్స్ ప్రకారం, అల్ క్వోజ్ నివాసి రిషద్ అహ్మద్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్‌లో టమోటా ధరలు కిలోగ్రాముకు 10 దిర్హామ్‌లకు అనగా ఇండియన్ కరెన్సీలో రూ. 250గా ఉన్నట్టు తెలిపాడు. అలాగే గత వారం కిలోకు 4 దిర్హామ్‌లు ఉన్న ఉల్లిపాయల ధర ఇప్పుడు కిలోకు 7 దిర్హామ్‌లకు అంటే సుమారు రూ. 175 పెరిగినట్టు పేర్కొన్నాడు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి అతను తరచూ అల్ అవేర్ మార్కెట్‌కు వెళ్తున్నానని.. కొన్ని రోజుల్లో ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చూసినట్టు తెలిపాడు. అయితే, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయనే నివేదికలు బయటకి రావడంతో ధరలను నియంత్రించడానికి దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తుల ధరల తనిఖీ చేపట్టింది.
ఆమోదం లేకుండా ధరలు పెంచకూడదు.
నివేదిక ప్రకారం, UAEలోని తొమ్మిది కీలక వస్తువులను నియంత్రణ ధరలకే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో వంట నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, పప్పుధాన్యాలు, బ్రెడ్ గోధుమలు ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా ఈ వస్తువుల ధరలను పెంచకూడదని. UAE అంతటా అవసరమైన వస్తువులు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
