AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HairLoss Alert: మలబద్ధకానికి బట్టతలకు లింకేంటి?.. 1.6 లక్షల మందిపై జరిపిన సర్వేలో షాకింగ్ ఫాక్ట్!

పురుషుల్లో జుట్టు రాలడం అనేది కేవలం వయస్సు రీత్యా వచ్చే సమస్య అనుకుంటే మీరు పొరబడినట్లే. దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది పురుషులపై జరిపిన తాజా అధ్యయనం ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. జుట్టు రాలడానికి, మన జీర్ణక్రియకు (Gut Health) విడదీయలేని సంబంధం ఉందని 'ట్రయా హెల్త్' జరిపిన సర్వేలో వెల్లడైంది. మీ కడుపులో సమస్య ఉంటే తల మీద జుట్టు ఎందుకు ఊడిపోతుందో ఇప్పుడు చూద్దాం..

HairLoss Alert: మలబద్ధకానికి బట్టతలకు లింకేంటి?.. 1.6 లక్షల మందిపై జరిపిన సర్వేలో షాకింగ్ ఫాక్ట్!
Gut Health And Hair Loss Link
Bhavani
|

Updated on: Mar 13, 2026 | 2:02 PM

Share

డిసెంబర్ 2024 నుండి 2025 వరకు సేకరించిన సమాచారం ప్రకారం, భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో పురుషుల జుట్టు వేగంగా రాలిపోతోంది. ముఖ్యంగా తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. జంక్ ఫుడ్, క్రమం లేని భోజన సమయాలు ఒత్తిడి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జుట్టును ఎలా బలహీనపరుస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం పైన నూనెలు రాస్తే సరిపోదని, అసలు కారణం లోపల ఉందని చెబుతున్న ఈ పరిశోధన వివరాలు మీకోసం..

1. మలబద్ధకం, జుట్టు రాలడం:

జీర్ణక్రియ సరిగ్గా లేని వారిలో, ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే పురుషుల్లో జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో ఈ సమస్య గత ఏడాదితో పోలిస్తే 4.10% పెరగడం గమనార్హం. అంటే కడుపు శుభ్రంగా లేకపోతే జుట్టుకు గండం పొంచి ఉన్నట్లే!

2. పోషకాల శోషణ వైఫల్యం:

మనం తినే ఆహారంలోని ప్రోటీన్, ఐరన్, జింక్, బి-విటమిన్లను మన జీర్ణవ్యవస్థ గ్రహించాలి. జుట్టులో 90% ఉండే ‘కెరాటిన్’ ఉత్పత్తికి ఇవి చాలా ముఖ్యం. జీర్ణవ్యవస్థ దెబ్బతింటే, ఈ పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరవు, ఫలితంగా జుట్టు బలహీనపడి రాలిపోతుంది.

3. ఇన్‌ఫ్లమేషన్ (శరీరంలో మంట):

జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల జుట్టు పెరగడం ఆగిపోయి, త్వరగా రాలిపోయే దశకు చేరుకుంటుంది.

4. కారణం ఏంటి?

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్: 10 నిమిషాల్లో వచ్చే డెలివరీ యాప్స్ వల్ల జంక్ ఫుడ్ వాడకం పెరగడం.

క్రమం లేని సమయాలు: బిజీ లైఫ్ వల్ల ఎప్పుడు పడితే అప్పుడు తినడం.

నీరు తక్కువగా తాగడం: పని ఒత్తిడిలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోకపోవడం.

ఒత్తిడి: పని ఒత్తిడి వల్ల ఎక్కువగా తినడం.

5. పరిష్కారం ఏంటి?

జుట్టు రాలడం అనేది ఒక అంతర్గత హెచ్చరిక సంకేతం. అందుకే కేవలం పైన వాడే షాంపూల మీద కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడం, పోషకాహారం తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. జుట్టు విపరీతంగా రాలుతున్నప్పుడు సొంత వైద్యం కాకుండా డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం.

Follow Us