- Telugu News Photo Gallery Relationship Tips: there is always a dispute between husband and wife so keep this things in the bedroom
Relationship Tips: ఇలా చేస్తే దాంపత్య జీవితం ఫుల్ ఖుష్.. ఈ విషయాల్లో భార్యాభర్తలూ బీకేర్‌ఫుల్..
ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్యం.. అబద్దం చెప్పడం, ఇలా ఎన్నో కారణాల వల్ల విడాకుల ఘటనలు ఎక్కువ అవుతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే.. మన పెద్దలు ఎప్పుడూ ఎవరికీ అబద్ధం చెప్పకూడదని బోధిస్తారు.
Updated on: May 06, 2023 | 2:10 PM

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనంగా మారుతున్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్యం.. అబద్దం చెప్పడం, ఇలా ఎన్నో కారణాల వల్ల విడాకుల ఘటనలు ఎక్కువ అవుతున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే.. మన పెద్దలు ఎప్పుడూ ఎవరికీ అబద్ధం చెప్పకూడదని బోధిస్తారు. ముఖ్యంగా భాగస్వామి విషయానికి వస్తే, వారితో ఎల్లప్పుడూ నిజాయితీతో ప్రేమతో ఉండాలంటారు. ఎందుకంటే మీరు మీ జీవితమంతా మీ భాగస్వామితో గడపవలసి ఉంటుంది.

అటువంటి పరిస్థితిలో మీరు అబద్ధాల జోలికి వెళ్లకుండా ఆనందంగా గడపటం మంచింది. ఎక్కువగా ప్రేమతో మాట్లాడటం.. నిజాలు చెప్పడం ద్వారా భార్యాభర్తల మధ్య బంధం మెరుగుపడుతుంది. అందుకే.. మీ తప్పును దాచడానికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదని గుర్తుంచుకోండి. మీ సంబంధాన్ని మరింత దృఢంగా మార్చేందుకు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాం అవేంటో తెలుసుకోండి.. దీనిద్వారా మీ బంధం మరింత బలపడుతుంది.

బహుమతులను ఎల్లప్పుడూ అభినందించండి: మీ భాగస్వామి మీకు బహుమతిగా ఇచ్చినట్లయితే, దానిని అభినందించండి. అయితే, ఆ బహుమతి మీకు అస్సలు నచ్చకపోవచ్చు. కానీ, ఇప్పటికీ ఎదుటి వ్యక్తి భావాలను మెచ్చుకుంటూ, వారిని మెచ్చుకుంటూ.. మీ జీవితంలో మధురమైన బహుమతి అని చెప్పండి.

ధైర్యాన్ని పెంచేలా చేయండి: ప్రతిదీ చక్కగా నిర్వహించండి. ఈ లైన్ మాత్రమే మీ భాగస్వామి ధైర్యాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి ఎలాగైనా ఇల్లు, ఆఫీసు బాధ్యతను నిర్వహిస్తాడు. ఒక్కోసారి అధిక శ్రమ కారణంగా భాగస్వామితో గ్యాప్ వస్తుంది.. ఇలాంటప్పుడు భాగస్వామికి నిజాన్ని నిర్భయంగా చెప్పడం, పొగడటం మంచింది.

ఆహారాన్ని మెచ్చుకోండి: మీ భాగస్వామి మీ కోసం ప్రేమతో ఏదైనా సిద్ధం చేసి ఉంటే.. అప్పుడు వారి ప్రయత్నాన్ని స్వాగతించండి.. ఆహారం బాగలేకపోయినా.. ఆ లోటును పట్టించుకోకుండా ఆహారాన్ని మెచ్చుకుంటే, మీ భాగస్వామి దానిని ఇష్టపడతారు.

మీ భాగస్వామిని అభినందించండి - మిస్ అవుతున్నాను అని చెప్పండి: కొత్త విషయాలను, డ్రెస్ ను మీకు నచ్చకపోయినా, వారిని ఎగతాళి చేయకండి. బాగుందంటూ మెచ్చుకోండి. ఆ తర్వాత ప్రేమతో అప్యాయతతో పలకరించండి. మీ భాగస్వామి వెంట ఎల్లప్పుడూ ఉండటం సాధ్యం కాదు. అలాంటప్పుడు మధ్యమధ్యలో మీ భాగస్వామికి ఐ మిస్ యు అని చెబితే, అది మీ ప్రేమను అనుభూతి చెందేలా చేస్తుంది. ఇలా చాలాసార్లు చేయడం వల్ల పెద్ద వివాదాలు కూడా పరిష్కారమవుతాయి.





























