- Telugu News Photo Gallery Spiritual photos Every Man should experience these thinks to get success in Life, says Acharya Chanakya
Chanakya Neeti: మిమ్మల్ని విజయానికి చేరువ చేసే చేదు అనుభవాలు.. తప్పక పొందితీరాలంటున్న చాణక్య..
ఆచార్య చాణక్యుడు స్వయంగా అనేక విషయాలలో అనుభవశాలి, మేధావి. అందుకే వివిధ అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఇంకా జీవిత మార్గాన్ని సుఖమయం చేసుకోవడానికి, ఈ మార్గమధ్యంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కూడా బోధించాడు. అందుకే అతని మాటలను పాటించేవారు ఈ నాటికి విజయమార్గంలో నడుస్తున్నారు. అయితే విజయమార్గంలో నడవాలనుకునే వ్యక్తికి జీవితంలో కొన్ని రకాల అనుభవాలు పరిచయం అయి ఉండాలని, అప్పుడే అతను లక్ష్యాన్ని సాధించగలడని చెప్పాడు. మరి మనిషికి ఏయే అనుభవాలు తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 06, 2023 | 8:10 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎవరి జీవితంలోనూ నిత్యం దుఃఖం ఉండదు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఘటనల నుంచి గుణపాఠాలను నేర్చుకుంటే జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. అంటే చేసిన తప్పులకు కారణాలు తెలుసుకుని వాటిని సరిచేసుకోవడమే విజయానికి మెట్టు అని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి, చాణక్యుడి ప్రకారం తప్పులు చేయడం నేరం కాదు, కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం నేరం.

చాణక్యుడు ప్రకారం ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు. అతను చేసే పనుల ద్వారా.. గొప్పదనం తెలుస్తుంది. గొప్పదనం అనేది ప్రారంభ పరిస్థితులు లేదా వైఫల్యాల ద్వారా నిర్ణయించబడదని, వాటిని అధిగమించడానికి తీసుకునే చర్యల ద్వారా నిర్ణయించబడుతుందని చాణక్యుడు నమ్ముతాడు. అపజయం కలిగిందని.. చేపట్టిన పనిని ఎప్పటికీ వదులుకోకూడదు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం స్వతహాగా చాలా సూటిగా ఉండే వ్యక్తిని ప్రజలు తప్పుగా ఉపయోగించుకుంటారు. నిటారుగా నునుపైన చెట్టును నరికివేయడంలో ఎటువంటి సమస్య లేదు కదా, కాబట్టి మీలో కొంత తెలివిని దాచి ఉంచడానికి ప్రయత్నించాలని చాణక్యుడు చెప్పాడు. అప్పుడే మిమ్మల్ని నలుగురు మోసం చేయకుండా ఉంటారు. అది మీ విజయానికి సుగమంగా మారుతుంది.

ఆచార్య చాణక్యుడు ఇతరుల వైఫల్యాలు, తప్పుల చూసి నేర్చుకోవడం అత్యంత ప్రాముఖ్యం అని చెప్పాడు. వ్యక్తిగత నష్టం గురించి ఆలోచించకుండా.. ఇతరులు చేసిన తప్పులను చూసి అర్థం చేసుకోవడం. వాటిని పునరావృతం చేయకుండా ఉండటం తెలివైన వ్యక్తి లక్షణం. అలాంటి వారు కూడా త్వరగా విజయం సాధిస్తారు.

కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.




