- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti these 3 things in life never leaves you alone in life
Chanakya Niti: మనిషి జీవితంలో ఈ మూడు విషయాలు తుది శ్వాసవరకూ మీతోనే ఉంటాయన్న చాణక్య..
ప్రతి వ్యక్తికి అతని జీవితంలో కొంతమంది స్నేహితులు ఉంటారు.. అంతేకాదు స్నేహం అంటే వీరిదే అన్నట్లు మరణం వరకు తమ స్నేహాన్ని విడిచి పెట్టరు. స్నేహానికి సంబంధించిన నిజమైన సూత్రాలు ఇవే అంటూ ఆచార్య చాణక్య కొన్ని విషయాలను చెప్పారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం
Updated on: May 06, 2023 | 1:25 PM

విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం మనిషికి జ్ఞానం అనేది ఒక ఆయుధం. ఎంత కష్టతరమైన గోడను కూడా జ్ఞానంతో బద్దలు కొట్టి విజయం సాధించవచ్చు. జ్ఞానాన్ని మించిన మిత్రుడు లేడని అంటారు. దీని కారణంగా ఒక వ్యక్తి విజయం సాధిస్తాడు. ఇది మీ గౌరవానికి కూడా కారణం అవుతుంది. జ్ఞానం మీ జీవితాంతం మీతోనే ఉంటుంది.

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.




