- Telugu News Photo Gallery Know these super Foods which will boost your stamina and give tremendous energy
Relationship Tips: లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ పదార్థాలతో స్టామినా పెంచుకోవచ్చు.. ట్రై చేయండి..
ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు లైంగిక పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. నపుసంకత్వం, సంతానలేమి లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నట్లు ఇటీవల పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, వీటికి ముఖ్యకారణం జీవనశైలి, మనం తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారమే కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Updated on: May 16, 2023 | 9:27 PM

ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు లైంగిక పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. నపుసంకత్వం, సంతానలేమి లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నట్లు ఇటీవల పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, వీటికి ముఖ్యకారణం జీవనశైలి, మనం తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారమే కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. లైంగిక సమస్యలను పలు రకాల ఆహార పదార్థాలతో ఎదుర్కోవచ్చని.. అలాగే వీటితో స్టామినాను పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే.. స్టామినా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

బీన్స్: ఖనిజాలు, ఐరన్ తో సమృద్ధిగా ఉన్న బీన్స్ శరీరం RBC (ఎర్ర రక్త కణాలు) ఉత్పత్తి చేయడంలో సహాయపడుతాయి. ఇది మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది.

కాఫీ: కాఫీ తక్షణ శక్తిని అందించేది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. కావున ఇది అలసటను నియంత్రించడానికి, తక్షణ ఎనర్జీకి ప్రసిద్ధి చెందింది. కానీ ఎక్కువ కెఫిన్ శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే, కాఫీ మిమ్మల్ని శక్తివంతంగా, చురుకుగా ఉంచుతుందని.. కానీ దానిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆకు కూరలు: బచ్చలికూర, పాలకూర వంటి ఆకుపచ్చని ఆకు కూరలు సూక్ష్మపోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శక్తిని పెంపొందించడానికి, RBC గణనలను మెరుగుపరచడానికి అవసరమైనవి. అలాగే, వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది.

మాంసం, చేపలు, చికెన్: ఈ ఆహారాలు పెరుగుదల, అభివృద్ధికి, కండరాల నిర్మాణానికి ముఖ్యమైనవి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కావున.. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో రోజంతా చురుకుగా ఉంటారు.

ఎర్ర ద్రాక్ష: ఎర్ర ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరం శక్తిని పెంచుతుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉన్నందున, డయాబెటిస్ ఉన్నవారికి తక్షణ శక్తిని అందించడానికి, శక్తిని పెంచడానికి ఇది మంచి ఎంపిక.

బీట్‌రూట్ రసం: వ్యాయామం చేసే ముందు ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీ శరీరం అలసిపోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేసేలా చేస్తుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్టామినాను పెంపొందించి.. అలసటను తగ్గిస్తుంది.

క్వినోవా: Quinoa సూపర్‌ఫుడ్.. తక్షణ శక్తిని అందించడానికి క్వినోవా బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇందులో ఎనిమిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్నాయి. అంతే కాదు ఇది ఉడికించడం కూడా చాలా సులభం.





























