AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి.. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం

దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఇరాన్‌ మరోసారి టార్గెట్‌ చేసింది. డ్రోన్లతో , మిస్సైళ్లతో ఎయిర్‌పోర్ట్‌పై విరుచుకుపడింది. డ్రోన్‌ దాడుల తరువాత ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో కాసేపు విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఇరాన్‌ డ్రోన్లను గాలిలోనే పేల్చేసినట్టు దుబాయ్‌ రక్షణ శాఖ వెల్లడించింది.

మరోసారి దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి..  విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
Dubai Airport Struck In Fresh Strikes By Iran
Balaraju Goud
|

Updated on: Mar 07, 2026 | 5:15 PM

Share

దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఇరాన్‌ మరోసారి టార్గెట్‌ చేసింది. డ్రోన్లతో , మిస్సైళ్లతో ఎయిర్‌పోర్ట్‌పై విరుచుకుపడింది. డ్రోన్‌ దాడుల తరువాత ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో కాసేపు విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఇరాన్‌ డ్రోన్లను గాలిలోనే పేల్చేసినట్టు దుబాయ్‌ రక్షణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మరోవైపు అబూదాబి ఎయిర్‌పోర్ట్‌పై కూడా ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసింది. అయితే తమ లక్ష్యం అమెరికా , ఇజ్రాయెల్‌ బలగాలు మాత్రమే అని ఇరాన్‌ మరోసారి స్పష్టం చేసింది.

శనివారం (మార్చి 07) ఇరాన్ యుఎఇలో కొత్త దాడులను ప్రారంభించింది. దుబాయ్ – అబుదాబిలలో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ విమానాశ్రయంలో డ్రోన్ ల్యాండ్ అయిందని అధికారులు పేర్కొన్నారు. అయితే అంతగా ప్రభావం లేదని, అడ్డగించిన క్షిపణి నుండి వచ్చిన శిథిలాలు నష్టాన్ని కలిగించాయని అధికారులు తెలిపారు. దీని తరువాత, దుబాయ్ వైమానిక ప్రాంతం మళ్ళీ మూసివేశారు. అంతకుంటే ఒక రోజు ముందు, దుబాయ్, ఖతార్ నివాసితులకు వారి ఫోన్లలో క్షిపణి బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. అయితే, ఎలాంటి ముప్పు లేదని ఖతార్ తన పౌరులకు హామీ ఇచ్చింది.

ఫ్లైట్-ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ Flightradar24 ప్రకారం, ఇరానియన్ డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందనే నివేదికల మధ్య అనేక విమానాలు దుబాయ్‌లో తిరుగుతున్నాయి. వాటి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అమెరికా – ఇరాన్ మధ్య పోరాటం రెండవ వారానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతోంది.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కేంద్రాలలో ఒకటి. హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండవది అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరాన్ దాడుల వల్ల ముఖ్యంగా ప్రభావితమైంది. ఒక కాన్కోర్స్ దెబ్బతిన్నట్లు, నలుగురు సిబ్బంది గాయపడ్డారని విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. టెర్మినల్స్ నుండి ఇప్పటికే ప్రయాణీకులను ఖాళీ చేయించామని పేర్కొంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి తర్వాత ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు రెండవ వారంలోకి అడుగుపెట్టింది. ఇరాన్ మధ్యప్రాచ్యంలోని ఎనిమిది దేశాలపై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటోంది. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా యుఎఇ తీవ్రంగా దెబ్బతింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us