- Telugu News Photo Gallery Relationship Tips: Four mistakes of partner in a relationship should not be ignored
Relationship Tips: మీ పాట్నర్‌తో బీకేర్‌ఫుల్..? ఈ నాలుగు అలవాట్లు ఉంటే ఇక సహించకండి.. ఎందుకంటే..
Relationship Tips in Telugu: భార్యా.. భర్త కావొచ్చు.. లేదా ప్రియుడు.. ప్రియురాలు కావొచ్చు సంబంధం కలకలం కొనసాగాలంటే.. కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. వివాహ లేదా ప్రేమ బంధంలో కొన్ని సార్లు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి..
Updated on: Jun 22, 2023 | 1:56 PM

భార్యా.. భర్త కావొచ్చు.. లేదా ప్రియుడు.. ప్రియురాలు కావొచ్చు సంబంధం కలకలం కొనసాగాలంటే.. కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. వివాహ లేదా ప్రేమ బంధంలో కొన్ని సార్లు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి.. అలాంటప్పుడు సంబంధాన్ని కొనసాగించడం కష్టతరం అవుతుంది. ముఖ్యంగా కొన్ని విషయాలు విడిపోవడానికి సైతం దారితీస్తాయి. బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు (తగాదాలు లేదా వాదనలు) తలెత్తడం సర్వసాధారణం. కానీ అవి కాస్త.. తీవ్రంగా మారితే సంబంధంలో ప్రతి పనీ కష్టంగా మారి.. విడిపోయే దారితీస్తుంది.

కొన్నిసార్లు భాగస్వామి విస్మరించడం కష్టతరంగా మారుతుంది. ఇది ఏం చెప్పినా.. ఏ పని చేసినా.. వాటిని భరించడం ఆమె లేదా అతనికి కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో కలిసుండటం కంటే.. విడిపోవడమే మేలు అనేలా మారుతుంది. భరించడం మంచిది కాని చెడు అలవాట్లను అస్సలు సహించవద్దంటున్నారు మానసిక నిపుణులు.. ముందు నచ్చజెప్పాలని.. వినకపోతే పెద్దలతో మాట్లాడాలని సూచిస్తున్నారు.

నిరంతరం అబద్ధం: భాగస్వామి ప్రతిదాని గురించి మీకు అబద్ధం చెప్పడం ప్రారంభిస్తే.. మీరు ఈ అలవాటుతో నిరంతరం వ్యవహరించవలసి వస్తే ఇది ఒక రకమైన మూర్ఖత్వంగా పరిగణించాలి. సంబంధంలో తరచుగా అబద్ధం చెబుతున్నారని భాగస్వామి భావిస్తే.. ఈ సంబంధం దారి తప్పిందని అర్థం చేసుకోవచ్చు. దీని గురించి మీరు మొదటగా అలవాటు మార్చుకోమని భాగస్వామితో మాట్లాడండి.. వారు అంగీకరించకపోతే విడిపోవడమే మంచిది.

నిర్లక్ష్యం అలవాటు: సంబంధంలో వివాదాల కారణంగా, కొన్నిసార్లు జీవిత భాగస్వామిని కూడా నిర్లక్ష్యం చేయవచ్చు. అంతేకాకుండా తన పని కారణంగా కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ముందుగా మీ భాగస్వామి దినచర్యను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారు మీతో మాట్లాడటానికి సమయాన్ని వెచ్చించగలిగితే మంచిది.. ఇంకా మిమ్మల్ని విస్మరిస్తే, సంబంధం అంతా బాగా లేదని అర్థం చేసుకోండి. ఈ రకమైన ప్రవర్తన మీ భాగస్వామి మీతో ఉండటం ఇష్టం లేదని చూపిస్తుంది.

చిన్న చిన్న విషయాలకే వాగ్వాదంః భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే మనస్పర్థలు వస్తాయి. అయితే మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు ప్రారంభమైతే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కొన్నిసార్లు గొడవల సమస్య చాలా తేలికగా ఉంటుంది.. కానీ, చిన్న చిన్న విషయానికే గొడవలు, పరిష్కారం చూపని విధంగా వాదనలు.. మీ సంబంధానికి మంచిది కాదు.

మోసంః సంబంధంలో ప్రేమ, సంరక్షణ, ఆత్మగౌరవంతో పాటు నమ్మకం కూడా చాలా ముఖ్యం. సంబంధంపై నమ్మకం లేకపోతే, ఆ సంబంధంలో జీవించడం చాలా కష్టమవుతుంది. మీ భాగస్వామి ప్రవర్తన.. అంటే.. అతను లేదా ఆమె మోసం చేస్తున్నారని మీకు అనిపిస్తే, దానిని ఏదో ఒక విధంగా నిర్ధారించుకోండి. రిలేషన్ షిప్ లో ఉండడం కంటే దాన్ని ముగించడం మేలు.





























