- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti on how to easily overcome difficult situations of life in telugu
Chanakya Niti: జీవితంలో సంక్షోభమా చాణుక్యుడు చెప్పిన ఈ విధానాలు అనుసరించి బయటపడండి
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవ జీవన విధానం గురించి అనేక అంశాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ప్రతికూల పరిస్థితులు తప్పనిసరి.. అయితే అటువంటి పరిస్థితుల నుండి సులభంగా పరిష్కరించడానికి లేదా బయటపడటానికి అనేక విధానాలు ఉన్నాయని చెప్పాడు.. వాటిని తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి .. వివిధ అంశాలను విశ్లేషించడానికి చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు. వీటిలో కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 22, 2023 | 1:34 PM

ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి చాలాసార్లు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడవద్దని సూచించారు. విజయాన్ని సాధించే సమయంలో అభ్యసన ప్రక్రియలో అపజయం కూడా ఒక భాగమని, జీవితంలో సరైన లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం కృషి చేయాలని చెప్పాడు చాణక్య.

సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని చాణక్యుడు సూచించాడు. విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలని అన్నారు. సోమరితనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పాడు. ఇంకా ఎవరికైనా సోమరితనాన్ని గొప్ప శత్రువుగా ఎత్తి చూపాడు.

ప్రశాంతంగా.. ఓపికగా ఉండండి: క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే.. ఒత్తిడి అధికం కావచ్చు. అటువంటి సమయంలో ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం. భావోద్వేగాలు మీ పని తీరుపై పడనివ్వవద్దు. సహనం ముఖ్యం, ఎందుకంటే కొన్ని సమస్యలు పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు. సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండండి.. మీలోని సామర్థ్యాన్నీ గుర్తించి నమ్మకం ఉంచండి.

ప్రణాళికను అభివృద్ధి చేయండి: క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి బాగా ఆలోచించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. సమస్యను చిన్నదిగా భావించేలా పనులుగా విభజించుకోండి. ఆ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దశలను వివరించండి. క్రమబద్ధమైన విధానం మీకు ఏకాగ్రతతో, వ్యవస్థీకృతంగా ఉండటానికి సహాయపడుతుంది.

సంతృప్తి: పురుషులు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను నెరవేర్చాలని చాణక్య విధానంలో చెప్పబడింది. వారిని మానసికంగా, శారీరకంగా తృప్తిగా ఉంచే బాధ్యతను భార్యలు నిర్వర్తించాలి. అలాంటి పురుషులు భార్యలకు ప్రీతిపాత్రులు. వారి సంసారం సుఖ సంతోషాలతో సాగుతుంది.





























