ఈనెల 25వ తేదీ నుంచి బుధ గ్రహం తన స్వక్షేత్రమైన మిధున రాశిలో సంచరించబోతోంది. ఈ సంచారం జూలై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. మిధున రాశిలో ఇప్పటికే సంచారం చేస్తూ ఉన్న రవి గ్రహంతో బుధ గ్రహం కలవడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు మిధున రాశిలో యుతి చెందడం అనేది ఒక శుభయోగం అని చెప్ప వచ్చు. కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి దారి దొరకటం, కొత్త ప్రయత్నాలకు అవకాశం ఏర్పడటం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ, సంతాన సమస్యలకు అన్నిటికీ ఏదో ఒక పరిష్కారం తప్పకుండా అందుబాటులోకి రావటమో లేదా సరైన మార్గం స్ఫురించటమో జరుగుతుంది. వివిధ రాశుల వారికి ఈ రవి, బుధ గ్రహాల కలయిక ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.