కృష్ణా జిల్లా గన్నవరంలో సినీ నటుడు జగపతి బాబు సందడి చేశారు. తన పొలం రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం ఆయన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ అనంతరం గన్నవరంలోని బంధువుల నివాసంలో గడిపారు. ప్రముఖ నటుడిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు.