- Telugu News Photo Gallery Cinema photos Jr ntr fans announce their support to janasena chief pawan kalyan through twitter
Pawan – Jr NTR: పవన్ ప్రయాణానికి అడ్డంకులు సృష్టించవద్దు.. ఎన్టీఆర్ వర్గం నుంచి ఊహించని ట్వీట్
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో ఊర మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ఇద్దరీ కోట్లలో ఫ్యాన్స్.. సారీ.. సారీ భక్తులు ఉన్నారు. ఇక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పేది ఏముంది. అయితే పవన్, తారక్ ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుంటారు.
Updated on: Jun 22, 2023 | 2:08 PM

ప్రజంట్ పవన్ వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన.. ప్రజంట్ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడుతూ.. తోటి హీరోలపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

మొన్న కాకినాడలో మాట్లాడుతూ.. అందరి హీరోల సినిమాలను తాను చూస్తానని.. వారిని లైక్ చేస్తానని చెప్పుకొచ్చారు పవన్. అందులో భాగంగానే ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి లాంటి స్టార్స్ ఫ్యాన్స్‌కు ఓ రిక్వెస్ట్ చేశారు.

తామంతా కలిస్తేనే ఫిల్మ్ ఇండస్ట్రీ అని.. అయితే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరన్నారు పవన్. ఆయా హీరోల ఫ్యాన్స్ అంతా ఈసారి ఎన్నికల్లో జనసేనకు అండగా నిలబడాలని కోరారు. ఏ హీరోని అయినా ఇష్టపడండి.. కానీ రాష్ట్రం ఫ్యూచర్ ఆలోచించి ఓటు వేయండి అని ఆయన పిలుపునిచ్చారు.

తాజాగా ముమ్మిడివరంలో మాట్లాడుతూ కూడా.. తన అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు గొడవ పడుతున్న విషయం తన వద్దకు వచ్చిందని పేర్కొన్నారు. తనకు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అందరంటే ఇష్టం ఉందని.. తనకు ఎలాంటి ఇగోలు లేవని.. ప్రభాష్, మహేశ్ తనకంటే పెద్ద హీరోలని పవన్ వ్యాఖ్యానించారు.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్‌కు మద్దతు తెలిపారు. ‘NTR Trends’ అనే ట్విట్టర్ పేజీ నుంచి ఓ రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, జనసేనాని కార్యకర్తలు ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో గొడవ పడొద్దని అక్కడ రిక్వెస్ట్ చేశారు. పవన్ పొలిటికల్ ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాసుకొచ్చారు.




